క్రీడాభూమి

తిరుగులేని షిపర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 12: నెదర్లాండ్స్ స్ప్రింటర్ డఫ్నే షిపర్స్ ట్రాక్‌పై తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మహిళల 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని సాధించింది. 2015లోనూ ఈ విభాగంలో టైటిల్‌ను సాధించిన ఆమె ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి, అభిమానులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 100 మీటర్ల పరుగులో అనూహ్యంగా మూడో స్థానంతో సంతృప్తి చెందిన ఆమె 200 మీటర్ల విభాగంలో ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని కనబరచింది. చివరి వరకూ అదే ఒరవడిని కొనసాగించి, లక్ష్యాన్ని 22.05 సెకన్లలో పూర్తి చేసింది. ఐవరీ కోస్ట్‌కు చెందిన మేరీ జోస్ టాలో 22.08 సెకన్లతో రజత పతకాన్ని అందుకోగా, బహమాస్ అథ్లెట్ షానే మిల్లర్ యుబో 22.15 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. రేస్ ముగిసిన డఫ్నే షిపర్స్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో పరిగెత్తానని చెప్పింది. రియో ఒలింపిక్స్ 200 మీటర్ల పరుగులో రజత పతకాన్ని అందుకున్న విషయాన్ని ఆమె గుర్తుచేస్తూ, ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగినట్టు చెప్పింది. తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది.

చిత్రం.. డఫ్నే షిపర్స్