క్రీడాభూమి

న్యూట్రల్ అథ్లెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: పురుషుల హ్యామర్‌త్రో ఈవెంట్‌లో వలెర్లీ ట్రోన్కిన్ న్యూట్రల్ అథ్లెట్‌గా బరిలోకి దిగాడు. డోపింగ్ పరీక్షలో అత్యధిక శాతం మంది పట్టుబడడంతోపాటు, ప్రభుత్వమే వ్యూహాత్మకంగా అథ్లెట్లతో నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగింప చేస్తున్నదన్న ఆరోపణల కారణంగా రష్యాపై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) సస్పెన్షన్ వేటు వేసింది. దీనితో తమను న్యూట్రల్స్‌గా గుర్తించాలని ఐఎఎఎఫ్‌ను రష్యా అథ్లెట్లు కోరారు. వీరి విజ్ఞప్తికి సమాఖ్య సానుకూలంగా స్పందించడంతో, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడేందుకు అర్హత సంపాదించిన ఎనిమిది రష్యా అథ్లెట్లలో ట్రోన్కిన్ కూడా ఉన్నారు. పురుషుల హ్యామర్ త్రో ఈవెంట్‌లో అతను రజత పతకాన్ని గెల్చుకున్నాడు. హ్యామర్‌ను అతను 78.16 మీటర్ల దూరానికి విసరగా, 79.81 మీటర్లతో పోలాండ్ వీరుడు పావెల్ ఫాజ్‌డెక్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. అతని సహచరుడు వొసిచ్ నొవిస్కీ 78.03 మీటర్లతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

చిత్రం.. వలెర్లీ ట్రోన్కిన్