క్రీడాభూమి

సహచరులతో కలిసి ధోనీ నెట్ ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంబుల్లా, ఆగస్టు 17: శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సిద్ధమవుతున్నది. గురువారం ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించగా, అందరి దృష్టి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై కేంద్రీకృతమైంది. కేదార్ జాధవ్, మనీష్ పాండే, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా తదితరులతో కలిసి 36 ఏళ్ల ధోనీ నెట్స్‌కు హాజరయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనితో ముచ్చటిస్తూ, ప్రాక్టీస్ తీరును గమనిస్తూ గడిపాడు. వనే్డ జట్టులో కూడా స్థానం దక్కించుకున్న కొంత మంది టెస్టు జట్టు క్రికెటర్లు కూడా నెట్స్‌లో శ్రమించారు. లంకతో ఈనెల 20న ఇక్కడ తొలి వనే్డ జరుగుతుంది. రెండు, మూడు వనే్డలు వరుసగా 24, 27 తేదీల్లో పల్లేకల్‌లో జరుగుతాయి. కొలంబోలో 31న నాలుగవ, సెప్టెంబర్ 3న చివరిదైన ఐదవ వనే్డను నిర్వహిస్తారు. సెప్టెంబర్ ఆరున కొలంబోలోనే ఏకైక టి-20 మ్యాచ్ జరుగుతుంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో లంకపై 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ సాధించిన టీమిండియా వనే్డ సిరీస్‌లోనూ ఆధిపత్యం కోసం ప్రయత్నించనుంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చిత్రం..నెట్ ప్రాక్టీస్‌కు వెళుతున్న మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ