క్రీడాభూమి

ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు భారత్ సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 18: ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌కు సిద్ధమయ్యేందుకు భారత్ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే మూడు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 97వ స్థానంలో ఉన్న భారత్ శనివారం తొలి ఫ్రెండ్లీలో మారిషస్‌ను ఢీ కొంటుంది. ర్యాంకింగ్స్‌లో మారిషస్ 160వ స్థానంలో ఉంది. ఆతర్వాత మరో ఫ్రెండ్లీలో, 125వ ర్యాంక్ జట్టు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌ను ఎదుర్కొంటుంది. వచ్చేనెల 5న మకావూతో జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు తన ప్రస్థానాన్ని మొదలుపెడుతుంది.