క్రీడాభూమి

నాకూ ఖేల్ రత్న ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: తనకు కూడా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న ఇవ్వాలని కేంద్రానికి పారాలింపియన్ దీపా మాలిక్ లేఖ రాసింది. రియో పారాలింపిక్స్ మహిళల షాట్‌పుట్‌లో రజత పతకం సాధించిన దీపా మాలిక్ పేరు గత ఏడాది చర్చకు వచ్చింది. కానీ, అవార్డుల కమిటీ ఆమె అభ్యర్థిత్వం పట్ల ఆసక్తిని చూపలేదు. ఈసారి పారాలింపియన్ దేవేంద్ర ఝజారియా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ పేర్లను కమిటీ ఇప్పటికే ఖరారు చేసి, అవార్డుల జాబితాను కేంద్రానికి పంపింది. ఈ పరిస్థితుల్లో దీపా మాలిక్ అభ్యర్థనకు కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం లేదన్నది వాస్తవం. అయితే, ప్రతిష్ఠాత్మక ఖేల్ రత్న పురస్కారానికి తాను అన్ని విధాలా అర్హురాలినని పారాలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర పుటల్లో చోటు సంపాదించిన దీపా మాలిక్ తన లేఖలో పేర్కొంది.