క్రీడాభూమి

గాడిలో పడిన టైటాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 19: వరుస పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ ఆట మళ్లీ గాడిలో పడింది. అంతర్-మండల చాలెంజ్ కింద శనివారం పటిష్టమైన యు ముంబాతో జరిగిన మ్యాచ్‌ని టైటాన్స్ ఐదు పాయింట్ల తేడాతో గెల్చుకుంది. రాహుల్ చౌదరి 13 పాయింట్లు సాధించి, టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సోమ్‌వీర్ 8 పాయింట్లు చేయగా, మొత్తం 37 పాయింట్లు సంపాదించిన టైటాన్స్ తన ప్రత్యర్థి యు ముంబాను 32 పాయింట్లకు కట్టడి చేసింది. అనూప్ కుమార్ 9, షబీర్ బప్పు 6, సురీందర్ సింగ్ 4 చొప్పున పాయింట్లు చేసినప్పటికీ, యు ముంబాను ఓటమి నుంచి కాపాడలేకపోయారు.
గెలిచిన హర్యానా: యుపి యోద్ధతో జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ జట్టు ఏడు పాయంట్ల తేడాతో గెలిచింది. హర్యా నా 36 పాయంట్లు చేయగా, యుపి 29 పాయంట్లు సాధించగలిగింది. హర్యానా తరఫున వికాస్ కండోల 9, సురేందర్ నడా 7 పాయంట్లు చేశారు. చివరి వరకూ ఇరు జట్లు చెరి 29 పాయంట్లతో సమవుజ్జీగా కొన సాగాయ. కానీ, చివరిలో రైడ్ పాయంట్లను సంపాదించడమేగాక, యుపిని ఆలౌట్ చేయడంతో హర్యానా కు అదనపు పాయంట్లు లభించాయ.

చిత్రం..తెలుగు టైటాన్స్, యు ముంబా మ్యాచ్‌లో ఓ దృశ్యం