క్రీడాభూమి

ఆధిపత్యం ఎవరికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, శ్రీలంక జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆదివారం మొదలుకానున్న నేపథ్యంలో, ఆధిపత్యం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. టీమిండియాను హాట్ ఫేవరిట్‌గా పేర్కొంటున్నప్పటికీ, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2019 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పటి నుంచి జట్టును తీర్చిదిద్దడానికి, వివిధ కాంబినేషన్లను పరీక్షించడానికి, ప్రయోగాలు చేయడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. లోకేష్ రాహుల్ ప్లేయంగ్ ఎలెవెన్‌లో ఉంటాడని అతను తేల్చి చెప్పడంతో, ఒక స్థానం కోసం కేదార్ జాధవ్, మనీష్ పాండే మధ్య తీవ్రమైన పోటీ తప్పడం లేదు.
భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాజయాల గురించి ఆలోచించడం లేదని లంక కెప్టెన్ ఉపుల్ తరంగ స్పష్టం చేశాడు. వనే్డ సిరీస్‌ను గెల్చుకునేందుకు పోరాడతామని అన్నాడు.

చిత్రాలు.. టేప్ చుట్టి బ్యాట్‌ను సిద్ధం చేసుకుంటున్న భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ *లోకేష్ రాహుల్