క్రీడాభూమి

ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లాండ్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్జిబాస్టన్, ఆగస్టు 20: వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 209 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. బ్యాటింగ్‌లో ఏమాత్రం ప్రతిభ కనబరచలేకపోయిన విండీస్ రెండు ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్లకే చేతులెత్తేయడంతో, ఐదు రోజుల మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 135.5 ఓవర్లలో 8 వికెట్లకు 514 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ 47 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. దీనితో ఫాలోఆన్ ఆడాల్సిరాగా, రెండో ఇన్నింగ్స్‌లో మరింత దారుణంగా విఫలమైంది. 45.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో జేమ్స్ ఆండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో స్టువర్ట్ బ్రాడ్‌కు మూడు వికెట్లు దక్కాయి.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 135.5 ఓవర్లలో 8 వికెట్లకు 514 డిక్లేర్డ్ (అలస్టర్ కుక్ 243, జో రూట్ 136, దావిద్ మలాన్ 65, రోస్టన్ ఛేజ్ 4/113, కెమెర్ రోచ్ 2/86.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 47 ఓవర్లలో 168 ఆలౌట్ (జెర్మయిన్ బ్లాక్‌వుడ్ 79 నాటౌట్, కేల్ హోప్ 25, కీరన్ పావెల్ 20, జేమ్స్ ఆండర్సన్ 3/34, స్టువర్ట్ బ్రాడ్ 2/47, టోబీ రొలాండ్ జోన్స్ 2/31).
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ (్ఫలోఆన్): 45.4 ఓవర్లలో 137 ఆలౌట్ (క్రెగ్ బ్రాత్‌వెయిట్ 40, జెర్మయిన్ బ్లాక్‌వుడ్ 24, జేమ్స్ ఆండర్సన్ 2/12, స్టువర్ట్ బ్రాడ్ 3/34, టోబీ రొలాండ్ జోన్స్ 2/18, మోయిన్ అలీ 2/54).