క్రీడాభూమి

తొలి రౌండ్‌లో.. ఎవరు.. ఎవరితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లాస్గో: మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పివి సింధుకు మొదటి రౌండ్‌లో బై లభించడంతో, రెండో రౌండ్‌లో వారి ప్రత్యర్థులు ఖరారు కాలేదు. కాగా, ఇదే విభాగంలో సోమవారం మొదటి రోజున రితుపర్ణ దాస్ తన తొలి రౌండ్‌లో మ్యాచ్‌ని అరి మిక్కెలాతో ఆడుతుంది. చోల్ బిర్చ్‌తో తన్వీ లాడ్ తలపడుతుంది. కాగా, పురుషుల విభాగంలో స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లో సెర్గీ సిరాంట్‌ను ఢీ కొంటాడు. మరో మ్యాచ్‌లో పాబ్లో అబియాన్‌తో సమీర్ వర్మ తలపడతాడు. లుకా శ్రాబెర్‌తో అజయ్ జయరామ్, వెయ్ నాన్‌తో సాయి ప్రణీత్ తమతమ తొలి మ్యాచ్‌లు ఆడతారు. పురుషుల డబుల్స్‌లో అనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీ సోమవారం తొలి రౌండ్ మ్యాచ్‌ని చుంగ్ ఎయ్ సియోక్, కిమ్ డకియంగ్‌తో ఆడుతుంది. మంగళవారం హిరోయుకీ ఎన్డో, యుతా వతనబే జోడీని సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఎదుర్కొంటుంది. అదే రోజు అర్జున్, శ్లోక్ రామచంద్రన్ జోడీ తమ మొదటి రౌండ్ మ్యాచ్‌ని లియో మిన్ చున్, చెన్ హెంగ్ సూతో ఆడుతుంది. మహిళల డబుల్స్ ఈవెంట్‌లో సంజనా సంతోష్, ఆరతి సారా సునీల్ జోడీ సోమవారం నటాల్యా వొసెక్, యెలిజవెటా జార్కా జోడీతో తలపడుతుంది. మంగళవారం అశ్వినీ పొన్నప్ప, సిక్కీ రెడ్డి తొలి రౌండ్‌లో రినిన్ అమెలియా, అన్నా చింగ్ ఇక్ చియోంగ్ జోడీని ఢీ కొంటుంది. అదే రోజు జరిగే మరో మ్యాచ్‌లో ఎఫ్జీ ముస్కెన్స్, సెరెనా పీక్ జోడీతో మేఘన జక్కంపూడి, పూర్విషా రామ్ జోడీ బలాబలాలు తేల్చుకుంటుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ బరిలోకి దిగుతుంది.