క్రీడాభూమి

పోరాటం సాగిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లాస్గో, ఆగస్టు 21: గతం కంటే ఈసారి ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో మెరుగైన ఫలితాన్ని సాధించడమే లక్ష్యమని, ఇందు కోసం పోరాటం సాగిస్తానని తెలుగు తేజం, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు అన్నది. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో సైనా నెహ్వాల్‌తోపాటు బై లభించిన సింధు సోమవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ మెగా టోర్నీలో రెండు పర్యాయాలు కాంస్య పతకాలను సాధించిన విషయాన్ని గుర్తుచేసింది. అప్పటి కంటే మంచి పతకాన్ని అందుకోవడానికి కృషి చేస్తానని తెలిపింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ స్వర్ణం సాధించడమే తన అంతిమ లక్ష్యమని చెప్పింది. ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ ముగిసిన తర్వాత లభించిన రెండు నెలల విరామం ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు సిద్ధమయ్యేందుకు బాగా ఉపయోగపడిందని చెప్పింది.
నా ఆట మెరుగుపడింది: మారిన్
రియో ఒలింపిక్స్‌తో పోలిస్తే తన ఆట మరింత మెరుగుపడిందని డిఫెండింగ్ చాంపియన్ కరోలిన్ మారిన్ వ్యాఖ్యానించింది. రియోలో సింధును ఓడించి మారిన్ స్వర్ణ పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో టైటిల్‌ను నిలబెట్టుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. రియో ఒలింపిక్స్ ముగిసి ఏడాది కావస్తున్నదని, దాని గురించి తాను మరచిపోయానని అన్నది.

చిత్రం..పివి సింధు