క్రీడాభూమి

పాఠాలు నేర్పిన వైఫల్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంబుల్లా, ఆగస్టు 21: కెరీర్‌లో ఎదుర్కొన్న వైఫల్యాలే తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. శ్రీలంకతో ఆదివారం జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో అజేయ శతకంతో కదంతొక్కి, భారత్‌ను విజపథంలో నడిపిన అతను ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, కాబట్టి, దాని గురించి ఆలోచించకుండా, మంచి ఫామ్‌ను కొనసాగించడమే తన లక్ష్యమని చెప్పాడు. బ్యాడ్ ప్యాచ్ కారణంగా గత ఏడాది న్యూజిలాండ్ సిరీస్‌కు సెలక్టర్లు ధావన్‌ను ఎంపిక చేయలేదు. నిజానికి శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కు తొలుత ప్రకటించిన జట్టులోనూ ధావన్‌కు చోటు దక్కలేదు. అయితే, ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో ధావన్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు. వనే్డ సిరీస్ తొలి మ్యాచ్‌లో అదే ఒరవడిని కొనసాగిస్తూ 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వరుస వైఫల్యాలకు కుంగిపోకుండా మళ్లీ ఫామ్‌లోకి రావడాన్ని ప్రస్తావించగా, అనుకున్న స్థాయిలో ఆడలేకపోయిన లేదా ఫామ్‌ను కోల్పోయిన ప్రతిసారీ కొత్తకొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించాడు. ఒక రకంగా తన ఆట మళ్లీ గాడిలో పడడానికి ఆ పాఠాలే ఉపయోగపడ్డాయని అన్నాడు.
ధావన్ అజేశ సెంచరీ భారత్‌కు శ్రీలంకపై రెండో అతిపెద్ద విజయాన్ని అందించింది. 1984 ఏప్రిల్ 8న షార్జాలో లంకను భారత్ 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల ఆధిక్యంతో గెలిచింది. శ్రీలంకలో శ్రీలంకపై టీమిండియాకు ఇదే భారీ విజయం. కాగా, ధావన్ లంకపై వనే్డల్లో రికార్డు సగటును కొనసాగిస్తున్నాడు. పది మ్యాచ్‌ల్లో అతను 757 పరుగులు సాధించడం విశేషం. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. శ్రీలంకపై కనీసం పది వనే్డలు ఆడిన భారత క్రికెటర్లు చేసిన స్కోర్లను పరిగణలోకి తీసుకుంటే, సగటుల్లో ధావన్‌దే అగ్రస్థానం. లంకపై గత ఆరు మ్యాచ్‌ల్లో ధావన్ యాభై కంటే ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం. అతని స్కోర్లు వరుసగా 94, 113, 79, 91, 125, 132 (నాటౌట్)గా నమోదయ్యాయి. ఆదివారం నాటి మ్యాచ్‌లో ధావన్ తన కెరీర్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. 2013 నవంబర్ 27న వెస్టిండీస్‌పై 95 బంతుల్లో 119 పరుగులు చేసిన అతను ఇప్పుడు లంకపై 71 బంతుల్లోనే సెంచరీ చేశాడు. విదేశాల్లో ఆడిన 11 వనే్డల్లో అతను ఎనిమిది సెంచరీలు సాధించడం గమనార్హం. కొంతకాలం అనుకున్న రీతిలో ఆడలేకపోయినప్పటికీ, మళ్లీ తనదైన శైలిలో విజృంభించడం వెనుక అనుభవాలు, వైఫల్యాలు నేర్పిన పాఠాలే కీలకమని ధావన్ వ్యాఖ్యానించాడు.

చిత్రం..శిఖర్ ధావన్