క్రీడాభూమి

నా అర్జున అవార్డు మహిళలకు అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు ఎనలేని సేవలందించి రెండు దశాబ్దాలు పైగా ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించిన ఒయినమ్ బెంబెం దేవి మంగళవారం తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డును దేశంలో సామాజిక సమస్యలపై పోరాడేందుకు ప్రయత్నిస్తున్న మహిళలకు అంకితమిచ్చింది. మన దేశానికి 85 ఫుట్‌బాల్ గేముల్లో ప్రాతినిథ్యం వహించి 32 గోల్స్ సాధించిన బెంబెం దేవి గత ఏడాది మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగన దక్షిణాసియా క్రీడల సందర్భంగా అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. అయితే తనకు ప్రకటించిన అర్జున అవార్డును దేశంలోని మహిళలతో పాటు తన తల్లికి, జట్టులోని సహచరులకు, కోచ్‌లకు కూడా అంకితమిస్తున్నానని ప్రకటించింది. అలాగే దీర్ఘ కాలం నుంచి తనకు అడుగడుగునా అండగా నిలిచిన అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్)కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ‘నిత్య జీవితంలో ఎదురవుతున్న సామాజిక సమస్యలను అధిగమించి తమ తమ రంగాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తున్న దేశ మహిళలతో పాటు నా తల్లికి, సహచరులకు, కోచ్‌లకు ఈ అవార్డును అంకితమిస్తున్నా. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి నాకు అండగా నిలుస్తున్న ఎఐఎఫ్‌ఎఫ్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని ఆమె తెలిపింది. 1995లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన బెంబెం దేవి ఫుట్‌బాల్ పట్ల దేశ మహిళల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు ఎఐఎఫ్‌ఎఫ్‌తో కలసి పనిచేస్తోంది.