క్రీడాభూమి

కాంస్య పతక పోటీకి అర్హత కోల్పోయిన గ్యానేందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, ఆగస్టు 22: పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ రెజిలింగ్ చాంపియన్‌షిప్స్‌లో మన దేశానికి చెందిన గ్యానేందర్ గ్రీకోరోమన్ విభాగంలో కాంస్య పతకంకోసం జరిగే ప్లే ఆఫ్ స్థానానికి అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. గ్రీకో రోమ్ 59 కెజిల కేటగిరీలో రెపెచేజ్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లభించింది. అయితే రెండో రౌండ్‌లో పరాజయం పాలవడం ద్వారా ఆ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈజిప్టుకు చెందిన మొస్త్ఫా హస్సన్ మహమ్మద్‌తో జరిగిన తొలి రౌండ్ పోటీలో గ్యానేందర్ 3-1 పాయింట్ల తేడాతో విజయం సాదించినప్పటికీ, రెండో రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన దిమిత్రో సింబాల్యుక్‌తో హోరాహోరీగా జరిగిన పోటీలో విజయం సాధించలేక పోవడంతో 2-2 పాయింట్లతో పోటీ టై అయింది. కాగా, ఈ రోజు పోటీలోఉన్న మిగతా భారతీయ రెజిలర్లు రవీందర్ (66 కెజిలు), హర్‌ప్రీత్ సింగ్ (80 కెజిలు), నవీన్ (130 కెజిలు) అందరు కూడా తమ క్వాలిఫికేషన్ పోటీల్లోనే ఓటమి పాలయి టోర్నమెంట్‌నుంచి నిష్క్రమించారు.