క్రీడాభూమి

యుఎస్ ఓపెన్‌కు అజరెన్కా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 22: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన బెలారస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెన్కా (28) ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. కుమారుడి సంరక్షణ విషయమై మాజీ భర్తతో తలెత్తిన వివాదాన్ని ఆమె పరిష్కరించుకోలేకపోవడమే ఇందుకు కారణం. గత ఏడాది డిసెంబర్‌లో తొలి బిడ్డకు జన్మనిచ్చిన అజెరెన్కా ఈ ఏడాది జూన్ నుంచి మళ్లీ టూర్‌ను ప్రారంభించింది. బిడ్డ సంరక్షణ విషయమై మాజీ భర్తతో తలెత్తిన వివాదం గురించి గత వారంలోనే ట్విట్టర్ ద్వారా అభిమానులకు వివరించిన ఆమె, కుమారుడుని తనతో పాటు న్యూయార్క్‌కు తీసుకురాలేకపోవచ్చని అప్పుడే స్పష్టం చేసింది. అజరెన్కా గత నెల 10వ తేదీన వింబుల్డన్ నాలుగో రౌండ్‌లో సిమోనా హాలెప్ చేతిలో ఓటమిపాలైన తర్వాత భర్త నుంచి విడిపోయింది. ఈ ఏడాది యుఎస్ ఓపెన్‌లో పాల్గొనలేకపోతున్నందుకు విచారిస్తున్నానని, కుటుంబ సమస్యలే ఇందుకు కారణమని తాజా ప్రకటనలో అజరెన్కా పేర్కొంది.