క్రీడాభూమి

ఖేల్ రత్నాలు.. ఈ ఏడాది ఇద్దరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లను ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డుతో సత్కరించాలని నిర్ణయించింది. మాజీ ఒలింపియన్లతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలతో కూడిన సెలెక్షన్ కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ఈ ఏడాది మహీంద్రా స్కార్పియో టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డును గెలుచుకున్న జఝరియా దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్ రత్న’ అవార్డును అందుకోనున్న తొలి పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. జావెలిన్ త్రోలో విశేషమైన ప్రతిభా పాటవాలను కనబరుస్తూ ముందుకు సాగుతున్న జఝరియా పారాలింపిక్స్‌లో మన దేశానికి రెండు పసిడి పతకాలను అందించిన విషయం విదితమే. దీంతో ఖేల్ రత్న అవార్డుకు మొదటి నామినీగా జఝరియాను ఎంపిక చేసిన రిటైర్డ్ జస్టిస్ సికె.్థక్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, ఈ పురస్కారానికి రెండవ నామినీగా హాకీ స్టార్ సర్దార్ సింగ్ (31)ను ఎంపికచేసి, వీరిద్దరినీ సంయుక్తంగా ఈ అవార్డును బహూకరించాలని సిఫారసు చేసింది. మిడ్‌ఫీల్డర్‌గా భారత హాకీ జట్టుకు ఎనలేని సేవలందిస్తూ 2015లో ‘పద్మశ్రీ’ అవార్డును అందుకున్న సర్దార్ సింగ్ ఆసియా క్రీడల్లో రెండు పతకాలను (2010లో గాంగ్జూలో జరిగిన క్రీడల్లో కాంస్య పతకాన్ని, 2014లో ఇంచియాన్‌లో జరిగిన క్రీడల్లో పసిడి పతకాన్ని) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే కామనె్వల్త్ క్రీడల్లో కూడా రెండు రజత పతకాలను గెలుచుకున్న సర్దార్ సింగ్, 2010, 2011లో వరుసగా రెండుసార్లు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆల్-స్టార్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు.
కాగా, ఖేల్ రత్న పురస్కారంతో పాటు క్రీడా మంత్రిత్వ శాఖ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డుల కోసం ఏడుగురిని, అర్జున అవార్డుల కోసం క్రికెటర్లు ఛటేశ్వర్ పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్, పారా అథ్లెట్లు మరియప్పన్, వరుణ్ సింగ్ భాటి, హాకీ ఆటగాడు ఎస్‌వి.సునీల్ సహా 17 మంది క్రీడాకారులను, ధ్యాన్‌చంద్ అవార్డులకు ముగ్గురిని (్భపీందర్ సింగ్-అథ్లెటిక్స్, సయ్యద్ షాహిద్ హకిమ్-్ఫట్‌బాల్, సమరై టెటె-హాకీ) ఎంపిక చేసింది. వీరంతా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్టప్రతి చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకుంటారు. రాజీవ్ ఖేల్ పురస్కారానికి ఎంపికైన వారికి పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.7.5 లక్షల నగదు బహుమతిని, అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన వారికి జ్ఞాపికలు, సర్ట్ఫికెట్లతో పాటు రూ.5 లక్షల చొప్పున నగదు బహుమతులను అందజేస్తారు.
ఈ ఏడాది క్రీడా పురస్కారాలకు
ఎంపికైన వారి జాబితా ఇదీ..
రాజీవ్ ఖేల్ రత్న అవార్డు: దేవేంద్ర జఝరియా (పారా అథ్లెట్), సర్దార్ సింగ్ (హాకీ).
ద్రోణాచార్య అవార్డులు: కీర్తిశేషులు డా.ఆర్.గాంథీ (అథ్లెటిక్స్), హీరానంద్ కటారియా (కబడ్డీ), జిఎస్‌ఎస్‌వి.ప్రసాద్ (బాడ్మింటన్-లైఫ్‌టైమ్), బ్రిజ్ భూషణ్ మహంతి (బాక్సింగ్-లైఫ్‌టైమ్), పిఎ.రఫెల్ (హాకీ-లైఫ్‌టైమ్), సంజయ్ చక్రవర్తి (షూటింగ్-లైఫ్‌టైమ్), రోషన్ లాల్ (రెజ్లింగ్-లైఫ్‌టైమ్).
అర్జున అవార్డులు: విజె.సురేఖ (ఆర్చరీ), ఖుష్బీర్ కౌర్ (అథ్లెటిక్స్), ఆరోకియా రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), ఎల్.దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), ఛటేశ్వర్ పుజారా (క్రికెట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఒయినమ్ బెంబెం దేవి (్ఫట్‌బాల్), ఎస్‌ఎస్‌పి.చౌరాసియా (గోల్ఫ్), ఎస్‌వి.సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), పిఎన్.ప్రకాష్ (షూటింగ్), ఎ.అమల్‌రాజ్ (టేబుల్ టెన్నిస్), సాకేత్ మైనేని (టెన్నిస్), సత్యవ్రత్ కదియన్ (రెజ్లింగ్), మరియప్పన్ (పారా అథ్లెట్), వరుణ్ సింగ్ భాటి (పారా అథ్లెట్).
ధ్యాన్ చంద్ అవార్డులు: భూపీందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయ్యద్ షాహిద్ (్ఫట్‌బాల్), సమరై టెటె (హాకీ).