క్రీడాభూమి

జర్మన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ శ్రీకాంత్, కశ్యప్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముల్హెమ్ ఆన్ డెర్ రర్ (జర్మనీ): జర్మనీ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ 15-21, 21-6, 21-16 తేడాతో నెదర్లాండ్స్‌కు చెందిన క్వాలిఫయర్ ఎరిక్ మెజిస్‌ను 48 నిమిషాల్లో ఓడించాడు. అతను ప్రీ క్వార్టర్స్‌లో కా లాంగ్ ఆంగస్ (హాంకాంగ్)తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో కశ్యప్ 21-12, 21-11 స్కోరుతో క్వాలిఫయర్ జాషువా మగీపై వరుస సెట్లలో విజయాన్ని నమోదు చేశాడు. కాగా, యువ ఆటగాడు సమీర్ వర్మ పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో కొరియాకు చెందిన లీ డాంగ్ కుయెన్‌ను ఎదుర్కొన్న అతను 21-8, 19-21, 19-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. వర్మ చివరి వరకూ శక్తివంచన లేకుండా పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు.
ప్రాక్టీస్ సిరీస్‌కు
సౌతాఫ్రికా, ఆసీస్ రెడీ
దర్బన్, మార్చి 3: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు అవసరమైన ప్రాక్టీస్ కోసం మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో తలపడేందుకు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు సిద్ధంగా ఉన్నాయి. శుక్రవారం దర్బన్‌లో మొదటి టి-20 మ్యాచ్ జరుగుతుంది. 6న జొహానె్నస్‌బర్గ్‌లో, 9న కేప్ టౌన్‌లో చివరి రెండు టి-20 మ్యాచ్‌లు ఆడతాయి. వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైన ఆటగాళ్ల బలాబలాలను విశే్లషించుకోవడానికి కూడా ఇరు జట్లకు ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఉపయోగపడనుంది. జయాపజయాల విషయం ఎలావున్నా, ఆటగాళ్లందరికీ తమనుతాము నిరూపించుకునే అవకాశమిచ్చి, వారు ఫామ్‌లోకి వచ్చేలా చూడడమే ఇరు జట్ల ప్రధాన లక్ష్యం. జార్జి బెయిలీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడంతో స్టీవెన్ స్మిత్ ఇప్పుడు మూడు ఫార్మెట్స్‌లోనూ ఆసీస్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆస్టర్ ఆగర్, నాథన్ కౌల్టర్ నైల్, జేమ్స్ ఫాల్క్‌నెర్, ఆరోన్ ఫించ్, జొష్ హాజెల్‌వుడ్, ఉస్మాన్ ఖాజా, మిచెల్ మార్ష్, గ్లేన్ మాక్స్‌వెల్, షేన్ వాట్సన్ వంటి మేటి ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారు. దాదాపుగా జట్టులో ఉన్నవారంతా టి-20 ఫార్మెట్‌లో తిరుగులేని వీరులుకావడంతో తుది జట్టు ఎంపిక కోసం కెప్టెన్ స్మిత్ కసరత్తు చేయకతప్పదు.
ఫఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికాలోనూ మేటి ఆటగాళ్లు ఉన్నారు. కేల్ అబోట్, హషీం ఆమ్లా, ఎబి డివిలియర్స్, క్వింటన్ డి కాక్, ఫర్హాన్ బెహర్డియన్, కాగిసో రబద తదితరులతో సౌతాఫ్రికా బలంగా ఉంది. బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే బయోమెట్రిక్ పరీక్షకు హాజరైన ఆరోన్ ఫిన్గిసోకు ఈ సిరీస్‌లో ఆడే అవకాశం లభిస్తుందా అన్నది అనుమానమే.