క్రీడాభూమి

జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో ముగిసిన భారత్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముల్హెమ్ ఆన్ డెర్ రర్ (జర్మనీ): జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రియో ఒలింపిక్ బెర్తు కోసం కాలంతో పోటీపడి పరుగులు తీస్తున్న కామనె్వల్త్ క్రీడల చాంపియన్ పారుపల్లి కశ్యప్‌కు మరోసారి గాయమవడంతో అతను ఈ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. వరుస గాయాల నుంచి కోలుకుని జర్మన్ ఓపెన్ బరిలోకి దిగిన కశ్యప్ కొరియాకు చెందిన ఎనిమిదో సీడ్ ఆటగాడు సన్ వాన్ హోతో గురువారం అర్ధరాత్రి పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడుతుండగా మోకాలికి గాయమైంది. దీంతో అప్పటికే 12-21, 11-16 గేముల తేడాతో వెనుకబడిన కశ్యప్ ఈ మ్యాచ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని ఎదురుచూస్తున్న కశ్యప్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఇదిలావుంటే, పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన మరో పోరులో ఆరో సీడ్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు పరాజయం ఎదురవడంతో అతను కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 10వ స్థానంలో కొనసాగుతున్న శ్రీకాంత్ ఈ మ్యాచ్‌లో 21-18, 18-21, 18-21 గేముల తేడాతో హాంకాంగ్‌కు చెందిన 12వ సీడ్ ఆటగాడు కా లాంగ్ అంగస్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో ప్రస్తుతం ఈ టోర్నీలో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ‘తెలుగు తేజం’ పివి.సింధు మాత్రమే భారత్ తరఫున పోరాడుతోంది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో 21-9, 21-17 గేముల తేడాతో కెనడాకు చెందిన మిఛెల్లీ లీని మట్టికరిపించిన సింధు క్వార్టర్ ఫైనల్ పోరులో చైనాకు చెందిన నాలుగో సీడ్ క్రీడాకారిణి వాంగ్ షిగ్జియాన్ చేతిలో ఓటమిపాలైంది.