క్రీడాభూమి

జపాన్ సూపర్ సిరీస్‌లో దుమ్మురేపిన సాత్విక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 19: జపాన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల యువ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ దుమ్ము రేపాడు. మంగళవారం ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ పోటీల్లో అసాధారణ శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించిన అతను ఏకంగా నాలుగు మ్యాచ్‌లలో విజయభేరి మోగించి పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో మెయిన్ డ్రాలో ప్రవేశించాడు. చిరాగ్ షెట్టితో కలసి పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన సాత్విక్ తొలి రౌండ్ క్వాలిఫయింగ్ పోరులో 14-21, 22-20, 21-18 గేముల తేడాతో జపాన్‌కు చెందిన హిరోకత్సు హషిమోటో, హిరోయుకి సయెకీ జోడీని, ఆ తర్వాత రెండో రౌండ్ క్వాలిఫయింగ్ పోటీలో 21-18, 21-12 తేడాతో జపాన్‌కే చెందిన కెయిచిరో మత్సుయి, యొషినోరి తకెయుచి జోడీని మట్టికరిపించాడు. గత వారం కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న సాత్విక్, చిరాగ్ షెట్టి బుధవారం పురుషుల డబుల్స్ మెయిన్ డ్రాలో జరుగనున్న తొలి రౌండ్ పోరులో ఇండోనేషియాకు చెందిన మూడో సీడ్ జోడీ మార్కస్ ఫెర్నాల్డి గిడెయాన్, కెవిన్ సంజయ సకముల్జోతో అమీతుమీ తేల్చుకోనున్నారు.
అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్వనీ పొన్నప్పతో కలసి బరిలోకి దిగిన సాత్విక్ తొలి రౌండ్ క్వాలిఫయింగ్ పోటీలో 21-13, 21-15 గేముల తేడాతో జపాన్‌కు చెందిన హిరోకి మిదోరికవా, నత్సు సయిటోపై, రెండో రౌండ్ క్వాలిఫయింగ్ పోటీలో 21-18, 21-9 గేముల తేడాతో జపాన్‌కే చెందిన హిరోకి ఒకమురా, నరు షినోయా జోడీపై విజయం సాధించాడు. సుదీర్మన్ కప్ టోర్నమెంట్ నుంచి చక్కటి ఫామ్‌లో కొనసాగుతున్న సాత్విక్, అశ్వనీ బుధవారం మిక్స్‌డ్ డబుల్స్ మెయిన్ డ్రాలో జరుగనున్న తొలి రౌండ్ పోరులో థాయిలాండ్‌కు చెందిన టిన్ ఇస్రియానెట్, పచరపన్ చొచువోంగ్ జోడీతో తలపడనున్నారు.
కాగా, పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్‌కు క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే చేతులెత్తేశాడు. తొలి రౌండ్ క్వాలిఫయింగ్ పోటీలో 21-15, 21-14 గేముల తేడాతో డెన్మార్క్ ఆటగాడిని ఓడించిన కశ్యప్ ఆ తర్వాత రెండో రౌండ్ క్వాలిఫయింగ్ పోటీలో 11-21, 21-18, 14-21 తేడాతో యు ఇగరషి (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో కశ్యప్ కనీసం మెయిన్ డ్రాలో ప్రవేశించకుండానే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
ప్రణవ్-సిక్కీ బోణీ
ఇదిలావుంటే, మిక్స్‌డ్ డబుల్స్ మెయిన్ డ్రాలో భారత్‌కు చెందిన ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్.సిక్కీరెడ్డి శుభారంభాన్ని అందుకున్నారు. తొలి రౌండ్‌లో వీరు 21-19, 17-21, 21-15 గేముల తేడాతో జపాన్‌కు చెందిన తొమొయా తకషినా, రీ ఎతోహ్ జోడీని మట్టికరపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.

చిత్రం..రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్