క్రీడాభూమి

కపిల్‌దేవ్ తర్వాత అసలైన ఆల్‌రౌండర్ అతనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 19: కపిల్ దేవ్ నిష్క్రమణ తర్వాత భారత క్రికెట్ జట్టుకు హార్దిక్ పాండ్యా రూపంలో అసలైన ఆల్ రౌండర్ లభించాడని భారత క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అభిప్రాయపడ్డాడు. 3హార్దిక్ పాండ్య ఓ అద్భుతమైన క్రికెటర్. జాతీయ క్రికెట్ అకాడమీలోను, జోనల్ క్యాంప్‌లోను నేను అతడ్ని దగ్గరినుంచి చూశాను. అతనికి అద్భుతమైన టాలెంట్ ఉంది. కపిల్‌దేవ్ తర్వాత సరయిన ఆల్‌రౌండర్ అతనే2 అని మంగళవారం ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ రాజ్‌పుత్ అన్నాడు. చెన్నైతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్‌డేలో హార్దిక్ పాండ్య కీలక ఇన్నింగ్స్‌తో భారత జట్టును ఆదుకోవడమే కాకుండా జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించిన విషయం తెలిసిందే. 3అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా అతను అన్ని ఫార్మాట్‌లలోను రాణించగలడు. మొదట్లో అతను వన్‌డేలు, టి-20 మ్యాచ్‌లకు మాత్రమే సరిపోతాడని అనుకునే వారు. అయితే అతను టెస్టులలోను రాణించగలడు. అలవోకగా బంతిని బౌండరీలకు తరలించే నేర్పు అతనిలో ఉంది. ఓ ఉత్తమ బ్యాట్స్‌మన్‌కు ఉండాల్సిన లక్షణం అది. అతని బౌలింగ్ కూడా బాగుంటుంది. అంతేకాదు అద్భుతమైన ఫీల్డర్ కూడా. మరో కపిల్ కాదగ్గ లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. అయితే కపిల్ స్థాయికి చేరుకోవాలంటే అతను అతను సాధించాల్సింది ఎంతో ఉంది2 అని రాజ్‌పుత్ చెప్పాడు.
కాగా, హార్దిక్ పాండ్య విషయంలో తన ప్లాన్స్‌ను అమలు చేయడంలో విఫలమైనానని ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆదమ్ జంపా అంగీకరించాడు. చెన్నైలో జరిగిన తొలి వన్‌డే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆదమ్ జంపా వేసిన ఒక ఓవర్‌లో మూడు సిక్స్‌లతో ఏకంగా 24 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 3ఒత్తిడిలోను చక్కగా బౌలింగ్ చేస్తానని నేను గర్వంగా చెప్పుకొనే వాడిని. అయితే చెన్నైలో జరిగిన వన్‌డేలో మాత్రం హార్దిక్‌పై నేను నా ప్రణాళికను చక్కగా అమలు చేయలేక పోయాను2 అని మంగళవారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ జంపా అన్నాడు. హార్దిక్ లాంటి ఆటగాడిని కట్టడి చేయలేకపోతే అది ఎంత దూరం పోతుందో ఆ మ్యాచ్ నిరూపించింది అని జంపా అన్నాడు. బహుశా కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యను త్వరగా అవుట్ చేస్తామని ఆశిస్తున్నట్లు అతను అన్నాడు. కాగా, మహేంధ్ర సింగ్ ధోనీని కూడా జంపా పొగడ్తలతో ముంచెత్తాడు. చెన్నై మ్యాచ్‌లో 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో కూరుకుపోయిన దశలో పాండ్యా, ధోనీ జోడీ ఆరో వికెట్‌కు 118 పరుగులు జోడించి మ్యాచ్ ఫలితానే్న మార్చి వేసిన విషయం తెలిసిందే. ధోనీ ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడని జంపా అంటూ, ధోనీ ఇలాంటి ఇన్నింగ్స్ ఎన్నో ఇన్నింగ్స్ ఆడి ఉంటాడంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

చిత్రం.. లాల్‌చంద్ రాజ్‌పుత్