క్రీడాభూమి

హాకీలో మహిళల సత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంట్వెర్ప్ (బెల్జియం), సెప్టెంబర్ 19: బెల్జియం పురుషుల జూనియర్ జట్టుతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు సత్తా చాటుకుంది. ఆరంభంలో ఏకపక్షంగా సాగినప్పటికీ ఆ తర్వాత ఉత్కంఠ భరితంగా మారిన ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 4-3 గోల్స్ తేడాతో విజయభేరి మోగించి యూరప్ పర్యటనను ఘనంగా ముగించింది. గుర్జీత్ కౌర్, కెప్టెన్ రాణి చెరో రెండు గోల్స్‌తో రాణించి భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు. యూరప్ పర్యటనలో భారత మహిళా జట్టుకు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జట్టుకు 7వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా తొలి గోల్‌ను అందించిన గుర్జీత్ కౌర్ 11వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ ద్వారా రెండో గోల్‌ను సాధించి పెట్టింది. ఆ తర్వాత కెప్టెన్ రాణి 13వ నిమిషంలో అద్భుతమైన ఫీల్డ్ గోల్‌ను అందించడంతో ఫస్ట్ క్వార్టర్ ముగిసే సమయానికే 3-0 గోల్స్ తేడాతో తిరుగులేని ఆధిక్యత సాధించిన భారత జట్టు సెకెండ్ క్వార్టర్‌లో గోల్స్ ఏమీ సాధించలేకపోయినప్పటికీ ప్రత్యర్థులను సమర్ధవంతంగా ప్రతిఘటించింది. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికి 3-0 గోల్స్ ఆధిక్యతలో నిలిచిన భారత జట్టు 33వ నిమిషంలో కెప్టెన్ రాణి మరో గోల్ సాధించడంతో మరింత పటిష్టమైన స్థితికి చేరుకుంది.
అయితే 38వ నిమిషంలో థిబౌల్ట్ నెవెన్ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకోవడంతో తొలి గోల్‌ను సాధించిన బెల్జియం జట్టుకు 42వ నిమిషంలో విలియమ్ వాన్ డెస్సెల్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌ను అందించాడు. దీంతో థర్డ్ క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ ఆధిక్యతను 4-2 గోల్స్‌కు తగ్గించిన బెల్జియం జట్టుకు మతియాస్ రెలిక్ 48వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా మూడో గోల్‌ను అందించాడు. దీంతో చివరి 10 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో బెల్జియం జట్టు ఈక్విలైజర్ కోసం ముమ్మరంగా ప్రయత్నించింది. అయితే పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థుల ప్రయత్నాలను సమర్ధవంతంగా ప్రతిఘటించిన భారత మహిళా జట్టు చివరికి 4-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది.