క్రీడాభూమి

ప్రో కబడ్డీ ఫైనల్స్‌కు పైరేట్స్, ముంబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్)-2016 టోర్నమెంట్‌లో టైటిల్ కోసం పాట్నా పైరేట్స్, యు ముంబా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్స్‌లో ఈ రెండు జట్లు తమతమ ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ జట్టు 40-21 పాయింట్ల తేడాతో పునేరీ పల్టన్ జట్టును మట్టికరిపించింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ ఆటగాడు ప్రదీప్ నర్వాల్ అద్భుతంగా రాణించి రైడ్స్ ద్వారా 10 పాయింట్లు సాధించగా, రోహిత్ కుమార్ 7 పాయింట్లు (రైడ్స్ ద్వారా 6, టాకిల్ ద్వారా 1), సందీప్ నర్వాల్ 5 (టాకిల్స్ ద్వారా), వినోద్ కుమార్ 4 (టాకిల్స్ ద్వారా), సునీల్ కుమార్ 3 (టాకిల్స్ ద్వారా), డి.సురేష్ కుమార్ 2 (టాకిల్స్ ద్వారా) పాయింట్లు సాధించారు. కాగా, పునేరీ పల్టన్ జట్టులో దీపక్ నివాస్ హుడా 6 పాయింట్లు, కెప్టెన్ మన్‌జీత్ చిల్లార్ 5, అజయ్ థాకూర్, జస్మీర్ సింగ్ గులియా, సుర్జీత్ రెండేసి పాయింట్లు సాధించగా, సబ్‌స్టిట్యూట్ ఆటగాడు నీలేష్ సలుంఖే మరో రెండు పాయింట్లు రాబట్టాడు.
అనంతరం రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో యు ముంబా 41-29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో యు ముంబా ఆటగాడు రిషాంక్ దేవ్ ఆడిగా అత్యుత్తమ స్థాయిలో రాణించి మొత్తం 13 (రైడింగ్స్ ద్వారా 11, టాకిల్స్ ద్వారా 2) పాయింట్లు సాధించగా, కెప్టెన్ అనూప్ కుమార్ రైడింగ్స్ ద్వారా 6 పాయింట్లు, టాకిల్స్ ద్వారా మొహిత్ చిల్లార్ 6 పాయింట్లు, ఫజల్ అత్రాచలీ 3 పాయింట్లు, జీవ కుమార్ 2 పాయింట్లు, రాకేష్ కుమార్ 3 (రైడింగ్స్ ద్వారా 2, టాకిల్ ద్వారా 1), సబ్‌స్టిట్యూట్ ఆటగాడు వినోద్ పౌల్యాస్ రైడింగ్ ద్వారా 1 పాయింట్ రాబట్టారు.
chitram...

తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతున్న పాట్నా పైరేట్స్, పునేరీ పల్టన్ జట్లు