క్రీడాభూమి

లంక అదృష్టం వరల్డ్ కప్‌కు అర్హత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక జట్టును అదృష్టం వరించింది. భారత్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో కనీసం రెండు మ్యాచ్‌లను గెల్చుకొని ఉంటే వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌కు నేరుగా అర్హత సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, 0-5 తేడాతో పరాజయాన్ని చవిచూసి, పరిస్థితిని సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. దీనితో క్వాలిఫయర్స్‌లో ఆడడం ద్వారా వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే, వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వనే్డను ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో గెల్చుకోవడం శ్రీలంకకు లాభించింది. వెస్టిండీస్ క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్ కప్‌లో అవకాశం కోసం ప్రయత్నించాలి. ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న దేశంగా ఇంగ్లాండ్ నేరుగా అర్హతను సంపాదించగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి ఐదు స్థానాలను ఆక్రమించిన ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు డైరెక్ట్ ఎంట్రీ సంపాదించాయి. మొదటి ఆరు స్థానాల్లో ఉన్న జట్లకు వరల్డ్ కప్‌కు నేరుగా క్వాలిఫై అవుతాయి. దీనితో శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. భారత్ చేతిలో వనే్డ సిరీస్‌లో వైట్‌వాష్ వేయించుకోవడంతో లంకకు అవకాశం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఇంగ్లాండ్ చేతిలో వెస్టిండీస్ మొదటి వనే్డలో ఓడడంతో, అదృష్టం కలిసొచ్చిన లంక వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయింది. ఇక క్వాలిఫయర్స్‌లో మొదటి రెండు స్థానాలను సంపాదించిన జట్లు ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందుతాయి.

బెయిర్‌స్టో శతకం

ఓపెనర్ జానీ బెయిర్‌స్టో తన కెరీర్‌లో తొలి వనే్డ శతకాన్ని నమోదు చేయడంతో, వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో, 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. కెప్టెన్ జాసన్ హోల్డర్ అజేయంగా 41 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ క్రిస్ గేల్ 37, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన వికెట్‌కీపర్ షాయ్ హోప్ 35 పరుగులు చేయగా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో విండీస్ అనుకున్న స్థాయిలో మెరుగైన స్కోరును నమోదు చేయలేకపోయింది. బెన్ స్టోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరి రెండు వికెట్లు సాధించారు.
విండీస్‌ను ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ చేసిందుకు 205 పరుగులు చేయాల్సిన ఇంగ్లాండ్ 30.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెయిర్‌స్టో 97 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలెక్స్ హాలెస్ (19), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (10) క్రీజ్‌లో నిలవలేకపోయారు. అయితే, జో రూట్ 53 బంతుల్లో 54 పరుగులు సాధించి, జట్టును విజయం ముంగిట నిలిపాడు. బెన్ స్టోక్స్ 10 బంతుల్లోనే, ఒక ఫోర్, రెండు సిక్సర్ల యంతో 23 పరుగులు చేశాడు. అతను భారీ సిక్సర్‌తో ఇంగ్లాండ్‌కు తిరుగులేని విజయాన్న అందించాడు.

సంక్షిప్త స్కోరుబోర్డు

వెస్టిండీస్ ఇన్నింగ్స్: 42 ఓవర్లలో 9 వికెట్లకు 204 (క్రిస్ గేల్ 37, షాయ్ హోప్ 35, జాసన్ హోల్డర్ 41 నాటౌట్, క్రిస్ వోక్స్ 2/41, అదిల్ రషీద్ 2/31, బెన్ స్టోక్స్ 3/43).
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 30.5 ఓవర్లలో 3 వికెట్లకు 210 (జానీ బెయిర్‌స్టో 100 నాటౌట్, జో రూట్ 54, బెన్ స్టోక్స్ 23 నాటౌట్, కెస్రిక్ విలియమ్స్ 2/50).

2019 వరల్డ్ కప్‌కు డైరెక్ట్ ఎంట్రీ పొందిన జట్లు

1. ఇంగ్లాండ్ (ఆతిథ్య దేశం), 2. ఆస్ట్రేలియా, 3. భారత్, 4. న్యూజిలాండ్, 5. దక్షిణాఫ్రికా, 6. పాకిస్తాన్. 7. బంగ్లాదేశ్, 8. శ్రీలంక. (క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు ఈ జాబితాలో చేరుతాయి. మొత్తం పది జట్లతో వరల్డ్ కప్‌ను నిర్వహిస్తారు).