క్రీడాభూమి

ఫైనల్‌కు ప్రత్యేకత ఏమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: ఆసియా కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగే ఫైనల్‌కు ప్రత్యేకత ఏమీ లేదని భారత జట్టు డైరెక్టర్ రవి శాస్ర్తీ స్పష్టం చేశాడు. టోర్నీలో జరిగిన మిగతా మ్యాచ్‌ల మాదిరిగానే దీనిని కూడా చూస్తామని అన్నాడు. శనివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ఏ మ్యాచ్‌ని ఏ విధంగా ఆడాలో టీమిండియా ఆటగాళ్లకు తెలుసునని వ్యాఖ్యానించాడు. ప్రతి మ్యాచ్‌ని నౌకౌట్ గేమ్‌గా తీసుకున్నారు కాబట్టే సర్వశక్తులు ఒడ్డి పోరాటం సాగించారని అన్నాడు. బంగ్లాదేశ్‌తో మొదటి మ్యాచ్ ఆడామని, ఫైనల్‌లోనూ అదే జట్టు ఎదురుకావడం ఆనందంగానే ఉందని రవి శాస్ర్తీ చెప్పాడు. ఒకప్పుడు పాకిస్తాన్‌తో భారత్‌కు గట్టిపోటీ ఉండేదని, ఇప్పుడు ఆ స్థానాన్ని బంగ్లాదేశ్ తీసుకుందా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ, ఆసియా ఖండంలో బలమైన జట్లు చాలానే ఉన్నాయని అన్నాడు. 2014లో శ్రీలంక టి-20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న విషయాన్ని అతను ఈ సందర్భంగా గుర్తుచేశాడు. పిచ్ తీరు ఎలా ఉంటుందనే అంశంపై మాట్లాడేందుకు రవి శాస్ర్తీ శ్రద్ధ చూపలేదు. పిచ్ తీరు ఎలా ఉంటుందనే విషయం తమ చేతిలో లేదని వ్యాఖ్యానించాడు. పిచ్ ఎలా ఉన్నా ఆడాల్సిందేనని అన్నాడు. బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడం లేదని, అయితే, విజయం సాధిస్తామన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు.