క్రీడాభూమి

భారత్‌కు వెళ్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: భారత్‌లో జరిగే టి-20 క్రికెట్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు వెళ్లొద్దంటూ మహిళా జట్టుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) హుకుం జారీ చేసింది. పురుషులతోపాటు మహిళల విభాగంలోనూ టి-20 వరల్డ్ కప్ భారత్‌లో జరుగుతుంది. సనా మీర్ నాయకత్వంలోని పాక్ మహిళల క్రికెట్ జట్టు ఈ టోర్నీకి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నది. అయితే, ఈ జట్టును భారత్‌కు పంపరాదని పిసిబి హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పాక్ క్రికెటర్లకు భద్రతను కల్పించే విషయంలో స్పష్టమైన హామీ రాలేదని, అందుకే మహిళల జట్టును పంపడం లేదని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపాడు. భద్రత గురించి లిఖిత పూర్వక హామీని కోరామని, అయితే, భారత క్రికెట్ బోర్డు ఇప్పటికీ సానుకూలంగా స్పందించలేదని వివరించాడు. భద్రత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశాడు. పురుషుల జట్టు భారత్‌కు వెళ్లాలా లేదా అన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. సోమవారం భారత్‌కు భద్రతాధికారుల బృందం వెళుతుందని, అక్కడ పరిస్థితులను సమీక్షించిన తర్వాత వచ్చే సమాచారం మేరకు స్పందిస్తామని షహర్యార్ తెలిపాడు. భారత్ నుంచి లిఖి తపూర్వక హామీ లభిస్తే మ హిళల జట్టును పంపడాని కి అభ్యంతరం ఉండదని పిసిబి వర్గాలు అంటున్నా య. భద్రతను గురించిన ఆందోళనే తప్ప జట్టును పంపడానికి మరే ఇతర కారణం లేదని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయ.