క్రీడాభూమి

బిస్తా శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: జై బిస్తా సెంచరీతో రాణించడంతో, రెస్ట్ఫా ఇండియాతో ఆదివారం ప్రారంభమైన ఐదు రోజుల ఇరానీ కప్ ట్రోఫీ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబయి తన తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 359 పరుగులు సాధించింది. ఓపెనర్ అఖిల్ హెవాద్కర్‌తో కలిసి బిస్తా తొలి వికెట్‌కు 193 పరుగులు జోడించాడు. 90 బంతులు ఎదుర్కొన్న అతను 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 104 పరుగులు చేశాడు. తర్వాత కొద్దిసేపటికే హెవాద్కర్ కూడా వెనుదిరగాడు. 148 బంతులు ఎదుర్కొన్న అతను 15 ఫోర్లతో 90 పరుగులు సాధించాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా వేగంగా పరుగులు రాబట్టడంలో సఫలమయ్యాడు. అతను 49 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సూర్యకుమార్ యాదవ్ 73, కెప్టెన్ ఆదిత్య తారే 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.