క్రీడాభూమి

రొనాల్డో విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా: స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో విజృంభణ స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగా మ్యాచ్‌లో సెల్టా విగోపై రియల్ మాడ్రిడ్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. రొనాల్డో హ్యాట్రిక్ సాయంతో మొత్తం నాలుగు గోల్స్ సాధించి రియల్ మాడ్రిడ్‌ను 7-1 తేడాతో గెలిపించాడు. అంతేగాక, అతను లా లిగాలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న తిమో జరాను మూడో స్థానానికి నెట్టేసి తాను ఆ స్థానాన్ని ఆక్రమించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ రియల్ మాడ్రిడ్ విజృంభణ కొనసాగింది. విగో ఆటగాళ్లు ప్రేక్షకపాత్రను పోషించక తప్పలేదు. మ్యాచ్ ఆరంభంలో కొంత సేపు పోరాడిన విగో ఆతర్వాత చేతులెత్తేసింది. 41వ నిమిషంలో పెప్ చేసిన గోల్‌తో రియల్ మాడ్రిడ్ ఖాతాను తెరిచింది. అనంతరం రొనాల్డో 50, 58, 64, 76 నిమిషాల్లో గోల్స్ సాధించాడు. గారెత్ బాలే 81వ నిమిషంలో చేసిన గోల్‌తో రియల్ మాడ్రిడ్ మొత్తం ఏడు గోల్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. విగో తరఫున అస్పాస్ 62వ నిమిషంలో ఓ కంటి తుడుపు గోల్ చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో, విల్లా రియల్‌పై లాస్ పల్మాస్ 1-0 తేడాతో గెలిచింది. గెటాఫ్, సెవిల్లే (1-1), డిపోర్టివో లా కరూనా, మలా (3-3) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

లా లిగాలో ‘టాప్-10’ గోల్ స్కోరర్లు
1. లియోనెల్ మెస్సీ (305 గోల్స్), 2. క్రిస్టియానో రొనాల్డో (252), 3. తిమో జరా (251), 4. హ్యూగో సాంచెజ్ (234), 5. రాల్ (228), 6. ఆల్ఫ్రెడో డి స్ట్ఫోనో 227, 7. సీసన్ రోడ్రిగెజ్ (223), 8. క్వినీ (219), 9. పాహినో (210), 10. ఎడ్ మున్డో సౌరెజ్ (195).

జర్మనీ ఓపెన్ బాడ్మింటన్
జురుయ్‌కి టైటిల్
మల్హెమ్ ఆన్ డెర్ రూ (జర్మనీ), మార్చి 6: జర్మనీ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను చైనా క్రీడాకారిణి లీ జురుయ్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె తన దేశానికే చెందిన వాంగ్ షిజియాన్‌ను 21-14, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. రెండు సెట్లలోనూ షిజియాన్ నుంచి ఎదురైన తీవ్ర ప్రతిఘటనను జురుయ్ సమర్థంగా ఎదుర్కొంది. కాగా, మహిళల డబుల్స్ విభాగంలో హువాంగ్ యా క్వియాంగ్, తాంగ్ జిన్‌హువా జోడీ గెల్చుకుంది. ఫైనల్‌లో వీరు పట్టిటా సుపజిరకుల్, సప్సిరీ తయేరతాన్‌చయ్ జోడీపై 21-14, 21-18 ఆధిక్యంతో విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో కో సంగ్ హ్యున్, కిమ్ హనా జోడీ 21-19, 21-12 స్కోరుతో షిన్ బాక్ చియో, చవో యూ జంగ్ జోడీపై నెగ్గింది.