క్రీడాభూమి

చాంపియన్ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కావడంతో 15 ఓవర్లకు కుదించిన ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొన్న భారత్ సునాయాస విజయాన్ని సాధించి సత్తా చాటింది. చాలకాలంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతువన్న శిఖర్ ధావన్ అర్ధ శతకంతో రాణించగా, విరాట్ కోహ్లీ అతనికి చక్కటి సహకారాన్ని అందించాడు. ఫలితంగా, బంగ్లాదేశ్ నిర్దేశించిన 121 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం రెండు వికెట్‌ను కోల్పోయి ఛేదించింది. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే, ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించి, టి-20 వరల్డ్ కప్‌లో ఫేవరిట్‌గా ముద్ర వేయించుకుంది. అంతకు ముందు భారత్ ఆహ్వానంపై బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో ఐదు వికెట్లకు 120 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిలకడగా ఆడేందుకు తీవ్రంగా పోరాడింది. జట్టు స్కోరు 27 పరుగుల వద్ద సౌమ్య సర్కార్ (14) వికెట్‌ను కోల్పోయిన ఈ జట్టు మరో మూడు పరుగులకే తమీమ్ ఇక్బాల్ (13) వికెట్‌ను కూడా చేజార్చుకుంది. షకీబ్ అల్ హసన్ 21, ముష్ఫికర్ రహీం 4 చొప్పున పరుగులు చేయగా, మష్రాఫ్ మొర్తాజా తన ఖాతాను తెరవకుండానే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన సబ్బీర్ రహమాన్ 29 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ రన్‌రేట్ వేగంగా పెంచేసిన మహమ్మదుల్లా కేవలం 13 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 33 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ 15 ఓవర్లలో ఐదు వికెట్లకు 120 పరుగులు చేసి, భారత్‌ను సవాలు చేసే లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 35, ఆశిష్ నెహ్రా 33 చొప్పున భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జస్‌ప్రీత్ బుబ్రా పొదుపుగా బౌలింగ్ చేసి, మూడు ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చాడు.
బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ సాధించేందుకు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తడబడుతూ ఆడిన రోహిత్ శర్మ ఒక పరుగు చేసి, అల్ అమీర్ హొస్సేన్ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌కు దొరికిపోయాడు. ఐదు పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయినప్పటికీ, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరు రెండో వికెట్‌కు 11.1 ఓవర్లలో 94 పరుగులు సాధించి, టీమిండియాను విజయం ముంగిట నిలిపారు. ధావన్ వికెట్ కూలిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ధోనీ అల్ అమీర్ హొస్సేన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. అతను ఆరు బంతుల్లోనే, ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 20 పరుగులు సాధించాడు. మరో నాటౌట్ బ్యాట్స్‌మన్ కోహ్లీ 28 బంతులు ఎదుర్కొని, 5 ఫోర్లతో 41 పరుగులు చేశాడు.
స్కోరుబోర్డు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఇక్బాల్ ఎల్‌బి జస్‌ప్రీత్ బుమ్రా 13, సౌమ్య సర్కార్ సి పాండ్య బి ఆశిష్ నెహ్రా 14, షకీబ్ అల్ హసన్ సి బుమ్రా బి అశ్విన్ 21, షబ్బీర్ రహ్మాన్ నాటౌట్ 32, ముష్ఫికర్ రహీం రనౌట్ 4, మష్రాఫ్ మొర్తాజా సి కోహ్లీ బి జడేజా 0, మహమ్మదుల్లా నాటౌట్ 33, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (15 ఓవర్లలో 5 వికెట్లకు) 120.
వికెట్ల పతనం: 1-27, 2-30, 3-64, 4-75, 5-75.
బౌలింగ్: అశ్విన్ 3-0-14-1, ఆశిష్ నెహ్రా 3-0-33-1, జస్‌ప్రీత్ బుమ్రా 3-0-13-1, రవీంద్ర జడేజా 3-0-25-1, హార్దిక్ పాండ్య 3-0-35-0.
భారత్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ సి సౌమ్య సర్కార్ బి తస్కిన్ అహ్మద్ 60, రోహిత్ శర్మ సి సౌమ్య సర్కార్ బి అల్ అమీన్ హొస్సేన్ 1, విరాట్ కోహ్లీ నాటౌట్ 41, మహేంద్ర సింగ్ ధోనీ నాటౌట్ 20, ఎక్‌స్ట్రాలు 0, మొత్తం (13.5 ఓవర్లలో రెండు వికెట్లకు) 122.
వికెట్ల పతనం: 1-5, 2-99.
బౌలింగ్: తస్కిన్ అహ్మద్ 3-0-14-1, అల్ అమీర్ హొస్సేన్ 2.5-0-30-1, అబూ హైదర్ 1-0-14-0, షకీబ్ అల్ హసన్ 2-0-6-0, మష్రాఫ్ మొర్తాజా 2-0-16-0, నాసర్ హొస్సేన్ 3-0-22-0.

బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో భారత్ విజయానికి బాటలు వేసిన శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ