క్రీడాభూమి

పాక్‌పై పైచేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 15: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి, రెండు రౌండ్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 3-1 తేడాతో చిత్తుచేసిన భారత్ మొత్తం తొమ్మిది పాయింట్లతో, గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. పాకిస్తాన్, జపాన్ జట్ల చెరి నాలుగు పాయింట్లను సంపాదించాయి. అయితే, గోల్స్ వ్యత్యాసం ప్రాతిపదికన పాకిస్తాన్‌కు ఈ గ్రూప్‌లో రెండో స్థానం లభించింది. భారత్, పాకిస్తాన్ జట్లు రెండో రౌండ్‌కు అర్హత సంపాదించగా, జపాన్, బంగ్లాదేశ్ జట్లు ఐదు నుంచి ఎనిమిది వరకు గల స్థానాల కోసం పోటీపడతాయి. కాగా, గ్రూప్ ‘బి’లో మలేసియా మొత్తం ఆరు పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉంది. దక్షిణ కొరియా, చైనా మూడు పాయింట్లు సంపాదించాయి. ఒమాన్ ఒక్క పాయింట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఈ గ్రూప్‌లో ఏఏ స్థానాలు ఎవరెవరికి దక్కుతాయన్నది ఆయా జట్ల చివరి లీగ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడుతుంది. సోమవారం నాటి టోర్నమెంట్ తుది గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో చైనా, మలేసియాతో ఒమాన్ జట్లు ఢీ కొంటాయి. ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, గ్రూప్ స్టాండింగ్స్‌ను బట్టి, మొదటి స్థానంలో నిలిచిన జట్టుతో భారత్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడుతుంది. రెండో స్థానాన్ని సంపాదించిన జట్టును పాకిస్తాన్ ఎదుర్కొంటుంది.
ఆది నుంచే దాడులు: పాకిస్తాన్‌ను కట్టడి చేసేందుకు మ్యాచ్ మొదటి నుంచే భారత్ దాడులకు ఉపక్రమించింది. ప్రత్యర్థిని డిఫెన్స్‌లో పడేసి, బంతిని ఎక్కువ సేపు తన ఆధీనంలోనే ఉంచుకుంది. 17వ నిమిషంలో చింగ్లెన్‌సనా సింగ్ చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. ఆధిక్యాన్ని సంపాదించిన వెంటనే కొంత సేపు రక్షణాత్మక విధానాన్ని అనుసరించిన భారత్, ఆతర్వాత వ్యూహాన్ని మార్చేసింది. మరోసారి దాడులకు దిగింది. 44వ నిమిషంలో రమణ్‌దీప్ సింగ్ గోల్ చేయగా, మరో నిమిషం వ్యవధిలో హర్మన్‌ప్రీత్ సింగ్ ద్వారా భారత్‌కు మూడో గోల్ లభించింది. కాగా, పాకిస్తాన్‌కు అలీ షాన్ ద్వారా ఒక కంటితుడుపు గోల్ లభించింది. టైటిల్ ఫేవరిట్‌గా ముద్ర వేయించుకున్న భారత్ రెండో రౌండ్‌లోనూ సునాయాస విజయాలను నమోదు చేసే అవకాశాలున్నాయి.
తనాకా ‘డబుల్’: మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన జపాన్ 3-1 తేడాతో గెలిచింది. కెన్టా తనాకా రెండు గోల్స్ చేసి, జపాన్‌ను గెలిపించాడు. కెన్జీ కిటాగటో 22వ నిమిషంలో గోల్ చేయగా, మరో ఏడు నిమిషాల్లోనే బంగ్లాదేశ్‌కు మామునర్ రెహ్మాన్ ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత, ప్రథమార్ధంతోపాటు, ద్వితీయార్ధంలో చాలాసేపు మరో గోల్ నమోదు కాలేదు. డెడ్‌లాక్‌ను 59వ నిమిషంలో తనాకా బ్రేక్ చేశాడు. అద్భుతమైన ఫీల్డ్ గోల్ సాధించి, జపాన్‌కు మళ్లీ ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్ నమోదరైన నిమిషం వ్యవధిలోనే అతను మరో గోల్ చేశాడు. అద్వితీయ ప్రతిభను కనబరచిన అతను జపాన్ విజయంలో కీలక భూమిక పోషించాడు.

చిత్రం..చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత హాకీ జట్టు ఆటగాళ్ల ఆనందం