క్రీడాభూమి

అమెరికాను క్వార్టర్స్ చేర్చిన టిమ్ వే హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: టిమ్ వే హ్యాట్రిక్ సాధించడంతో, పరాగ్వేను 5-0 తేడాతో చిత్తుచేసిన అమెరికా అండర్-17 సాకర్ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. అంతకు ముందు కొలంబియాపై 4-0 ఆధిక్యంతో విజయం సాధించిన జర్మనీ కూడా క్వార్టర్స్ చేరింది. పరాగ్వేపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచిన అమెరికా మొదటి నుంచి దూకుడుగానే ఆడింది. ప్రత్యర్థి ఆటగాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, దాడులు చేసింది. మైదానమంతా మెరుపు వేగంతో కదులుతూ, అమెరికాకు వెన్నుముకగా నిలిచిన టిమ్ వే 19, 53, 77 నిమిషాల్లో గోల్స్ సాధించాడు. ఆ జట్టుకు మిగతా రెండు గోల్స్ ఆండ్రూ కార్ల్‌టన్, జొష్ సార్జెంట్ ద్వారా లభించాయి. మొత్తం మీద మ్యాచ్ ఏక పక్షంగా ముగిసింది. అంతకు ముందు కొలంబియాతో జరిగిన మ్యాచ్‌ని టైటిల్ ఫేవరిట్ జర్మనీ సులభంగా తన ఖాతాలో వేసుకుంది. జాన్ ఫెటే ఎఆర్‌పి రెండు గోల్స్ చేసి, జర్మని విజపథంలో నడిపించాడు. 7వ నిమిషంలో అతను తొలి గోల్ సాధించాడు. 39వ నిమిషంలో యాన్ బిసెక్, 49వ నిమిషంలో జాన్ యెబో గోల్స్ చేయగా, 65వ నిమిషంలో ఫెటే ఎఆర్‌పి తన రెండో గోల్‌ను మోదు చేశాడు. ప్రత్యర్థిని గోల్స్ చేయకుండా అడ్డుకోవడానికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన కొలంబియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.

చిత్రం..హ్యాట్రిక్ వీరుడు టిమ్ వే