క్రీడాభూమి

పృథ్వీకి విశ్రాంతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: వచ్చేనెల మలేసియాలో జరిగే అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి యువ సంచలన బ్యాట్స్‌మన్ పృథ్వీ షాకు సెకల్టర్లు విశ్రాంతినిచ్చాడు. ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లిన భారత్ అండర్-19 జట్టుకు నాయకత్వం వహించిన 17 ఏళ్ల వృథ్వీ షా గత ఏడాది తమిళనాడుతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముంబయి విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. రంజీ చరిత్రలో, తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ తెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు చేశాడు. ఇటీవల దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో 154 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇప్పుడు జరుగుతున్న రంజీ ట్రోఫీలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతనిని రంజీ ట్రోఫీలో కొనసాగించాలని భారత్ ‘ఎ’, అండర్-19 జట్ల కోచ్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చేసిన సూచనను పరిగణలోకి తీసుకొని సెలక్టర్లు అతనిని అండర్-19 ఆసియా కప్ టోర్నీకి తీసుకోలేదని తెలుస్తున్నది. నవంబర్ 9 నుంచి 20 వరకు జరిగే ఆ టోర్నీలో అతని స్థానంలో జట్టుకు హమాంశు రాణా నాయకత్వం వహిస్తాడు.
జట్టు వివరాలు: హిమాంశు రాణా (కెప్టెన్), అభిషేక్ శర్మ (వైస్ కెప్టెన్), అథర్వ తైదే, మనోజ్ కర్ల, సల్మాన్ ఖాన్, అనుజ్ రావత్, హార్విక్ దేశాయ్, రియాన్ పరాగ్, అనుకూల్ రాయ్, శివ సింగ్, తనుష్ కొటియన్, దర్శన్ నల్కాండే, వివేకానంద్ తివారీ, ఆదిత్య థాకరే, మన్దీప్ సింగ్.

చిత్రం.. పృథ్వీ షా