క్రీడాభూమి

శ్రీ్ధర్ వారసుడి కోసం వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన ఎంవి శ్రీ్ధర్ స్థానంలో కొత్త జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్)ను నియమించేందుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగానే ఆ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించింది. అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న వారినే అర్హులుగా పేర్కొంది. ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఒక ప్రకటనలో తెలిపింది. బోర్డు జిఎం పదవికి శ్రీ్ధర్ గత నెల రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ)లో సభ్యత్వం ఉన్న కొన్ని క్లబ్‌లకు శ్రీ్ధర్ యజమాని అని మాజీ క్రికెటర్ ఆయూబ్ ఖాన్ చేసిన ఆరోపణలపై బిసిసిఐ వివరణ కోరింది. అయితే, వివరాలను సమర్పించడానికి ఇష్టపడని శ్రీ్ధర్ రాజీనామా చేశాడు.