క్రీడాభూమి

డబ్ల్యుడబ్ల్యుఇలో కవిత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: భారత పవర్ లిఫ్టర్ కవితా దేవి త్వరలోనే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైనె్మంట్ (డబ్ల్యుడబ్ల్యుఇ)లో దర్శనం ఇవ్వనుంది. పంజాబ్‌కు చెందిన ఆమెతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు డబ్ల్యుడబ్ల్యుఇ చాంపియన్ జిందర్ మహల్ ఒక ప్రకటనలో తెలిపాడు. భారత్ నుంచి ‘ది గ్రేట్ ఖలీ’గా అందరికీ తెలిసిన దలీప్ సింగ్ రాణా తర్వాత ఈ డబ్ల్యుడబ్ల్యుఇలో పాల్గొనే అవకాశం కవితకు మాత్రమే దక్కింది. అంతేగాక, ఈ రెజ్లింగ్‌లో పోటీపడనున్న తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు పుస్తకాల్లో చోటు చేసుకుంది. 2016 దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన కవిత ఇటీవల రెజ్లర్ బిబి బుల్ బుల్‌తో చేసిన ఫైట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఆమె పేరు యావత్ దేశంలో మారుమోగింది. డబ్ల్యుడబ్ల్యుఇ ఆమెతో ఒప్పందానికి ముందుకొచ్చింది. త్వరలోనే అంతర్జాతీయ వేదికపై ఆమె ప్రేక్షకులను అలరించనుంది.