క్రీడాభూమి

గోల్‌కీపర్ మృతిపై దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, అక్టోబర్ 16: ఇండోనేసియాలో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన గోల్‌కీపర్ చొయిరుల్ హుడా మృతి అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. మైదానంలో పొరపాటున ఒక ఆటగాడిని ఢీకొన్న చొయిరుల్ అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుప్రతికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన స్వస్థలమైన తూర్పు జావాలోని పెర్సెలా క్లబ్‌కు చాలాకాలంగా గోల్‌కీపర్‌గా సేవలు అందిస్తున్న 38 ఏళ్ల చొయిరుల్ ఒక లీగ్ మ్యాచ్ అడుతున్నప్పుడు బ్రెజిల్‌కు చెందిన రామొన్ రోడ్రిగ్స్‌ను ఢీకొన్నాడు. ఛాతీకి బలమైన గాయం కావడంతో అతను అక్కడే కూలిపోయాడు. అధికారులు వెంటనే స్పందించి, అతనిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా, అతను ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని, గుండె పోటు కూడా వచ్చిందని వైద్యులు తెలిపారు. చికిత్స అందిస్తుండగానే తుది శ్వాస విడిచాడని ప్రకటించారు. చొయిరుల్ మృతి వార్త ఇండోనేషియాలో ఫుట్‌బాల్ రంగాన్ని శోక సంద్రంలో ముంచేసింది. వేలాది మంది అభిమానులు అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు.