క్రీడాభూమి

‘ప్రాక్టీస్’కు కివీస్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 16: టీమిండియాతో వనే్డ, టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లు ఆడనున్న న్యూజిలాండ్ అంతకు ముందు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగే రెండు కీలక వామప్ మ్యాచ్‌లకు సిద్ధమైంది. వీటిలో మొదటిది మంగళవారం జరగనుంది. ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొవడం కివీస్ బ్యాట్స్‌మెన్‌కు కష్టం కాదు కాబట్టి వారి దృష్టి స్పిన్ బౌలింగ్‌పై కేంద్రీకృతమైంది. భారత పిచ్‌లపై స్పిన్‌ను ఎంత సమర్థంగా ఎదుర్కొంటే, విజయావకాశాలను అంతగా పెంచుకోవచ్చనే అభిప్రాయాన్ని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెన్సన్, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఇప్పటికే వ్యక్తం చేశారు. చాలా మంది యువ ఆటగాళ్లతో కూడిన బోర్డు ప్రెసిడెంట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్ ‘ఎ’తో పోటీపడి, సిరీస్‌ను గెల్చుకున్న భారత్ ‘ఎ’ తరఫున అతను అద్భుత ప్రతిభ కనబరిచాడు. అతనితోపాటు కరుణ్ నాయర్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్, యువ సంచలనం పృథ్వీ షా వంటి సమర్థులు ఈ జట్టులో ఉన్నారు. బౌలింగ్ విషయానికి వస్తే, సీనియర్ బౌలర్లను బోర్డు ప్రెసిడెంట్స్ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. కాబట్టి, ధవళ్ కులకర్ణి, జయదేవ్ ఉనాద్కత్ వంటి ద్వితీయ శ్రేణి పేసర్లతోనే కివీస్ బ్యాట్స్‌మెన్ సరిపుచ్చుకోవాలి. స్పిన్నర్లు షాబాజ్ నదీం, రాహుల్ చహార్ ఏ స్థాయిలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను నిలువరిస్తారో చూడాలి. నిజానికి స్పిన్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను ఖరారు చేసుకోవడానికే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఉపయోగించుకోవాలన్నది న్యూజిలాండ్ అభిప్రాయం. కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ వంటి ప్రతిభావంతులను ఎదుర్కొనే అవకాశం లేకపోవడంతో, వారు నదీం, చహార్ బౌలింగ్‌నే విశే్లషించుకోవాల్సి ఉంటుంది. ఇలావుంటే, జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి చాలా మంది భారత యువ ఆటగాళ్లకు ఇదే సరైన సమయం. మహేంద్ర సింగ్ ధోనీకి సిసలైన వారసుడిగా పేరుతెచ్చుకున్న రిషభ్ పంత్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రికార్డు స్కోరుతో అందరినీ ఆకట్టుకున్న పృథ్వీ షా వంటి బ్యాట్స్‌మెన్ తమను తాము నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. సమర్థుడైన స్పిన్నర్‌గా ఇప్పుడిప్పుడే గుర్తింపు సంపాదిస్తున్న నదీం కూడా జాతీయ జట్టులో స్థానంపై కనే్నశాడు. న్యూజిలాండ్‌తో జరిగే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు వీరి ప్రయత్నాలకు సరైన వేదికలు. ఎంత మంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారో, ఎంత మంది సెలక్టర్లను ఆకట్టుకుంటారో చూడాలి. భారత్‌లో టీమిండియాను ఎదుర్కోవడం అనుకున్నంత సులభం కాదన్న వాస్తవం న్యూజిలాండ్‌కు తెలుసు. అందుకే, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌తోపాటు సీనియర్లు రాస్ టేలర్, మార్టిన్ గుప్టిల్ కివీస్ బ్యాటింగ్ భారాన్ని తన భుజాలపై వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోర్డు ప్రెసిడెంట్స్ జట్టులో అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న బౌలర్లు లేకపోయినప్పటికీ, భారత పిచ్‌ల తీరుతెన్నులు ఎలావుంటాయన్నది తెలియకపోవడంతో కివీస్ సీనియర్ బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవు.