క్రీడాభూమి

భారత్ గెలుస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య దేశం భారత్ గెలుస్తుందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ జోస్యం చెప్పాడు. కానీ, పోటీలో ఉన్న అన్ని జట్లూ విజయాలు సాధించాలన్న పట్టుదతోనే బరిలోకి దిగుతున్నాయని, కాబట్టి పోరు తీవ్రంగా ఉంటుందని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డాడు. ఫేవరిట్ అంటే తన ఉద్దేశంతో బలమైన జట్టని చెప్పాడు. అలాంటి జట్టును ఓడించడం అసాధ్యం కాకపోయినా సులభం మాత్రం కాదని స్పష్టం చేశాడు. ఈనెల 15న నాగపూర్‌లో తాము మొదటి మ్యాచ్‌ని భారత్‌తో ఆడతామని గుర్తుచేస్తూ, బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడం శుభారంభానికి సూచికగా పేర్కోవచ్చని 25 ఏళ్ల ఈ యువ బ్యాట్స్‌మన్ అన్నాడు. ఎలాంటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ సీనియర్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కలమ్ జట్టులో లేకపోవడం వల్ల తమ జట్టుకు కొన్ని ఇబ్బందులు తప్పవని అంగీకరించాడు. మెక్‌కలమ్ లాంటి ప్రతిభావంతుడు జట్టులో లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుందని, అయితే, దానిని భర్తీ చేయడానికి తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నాడు.
టీమిండియానే ఫేవరిట్: లారా
దుబాయ్: టి-20 ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో జరిగే ఏ టోర్నీల్లోనైనా భారత జట్టు అద్భుతంగా ఆడుతుందని ఒక ఇంటర్వ్యూలో లారా తెలిపాడు. వాతావరణ పరిస్థితులు, పిచ్‌ల స్వభావంపై స్పష్టమైన అవగాహన ఉన్నందున భారత క్రికెటర్లనే హాట్ ఫేవరిట్స్‌గా పేర్కోవాల్సి ఉంటుందన్నాడు. వెస్టిండీస్ విజయావకాశాలపై అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ ఆ జట్టు గట్టిపోటీనిస్తుందని అన్నాడు. విండీస్‌ను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని, అయితే, విజయావకాశాలు మాత్రం భారత్‌కే ఎక్కువగా ఉన్నాయన్నది తన అభిప్రాయమని చెప్పాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఈ ఫార్మెట్‌లో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా అవతరించిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. టీమిండియాలో సమర్థులు ఎంతో మంది ఉన్నారని అన్నాడు. డారెన్ సమీ, క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్ వంటి ఆటగాళ్లు పూర్తి స్థాయిలో రాణిస్తే వెస్టిండీస్ నుంచి భారత్‌కు సవాళ్లు తప్పవని వ్యాఖ్యానించాడు. మొత్తం మీద టి-20 వరల్డ్ కప్ ఉత్కంఠ భరితంగా సాగుతుందని జోస్యం చెప్పాడు.

టాప్‌గేర్‌లో ఉన్నాం
భారత కెప్టెన్ ధోనీ వ్యాఖ్య
కోల్‌కతా, మార్చి 8: ప్రస్తుతం తమ జట్టు టాప్‌గేర్‌లో ఉందని, టి-20 వరల్డ్ కప్‌లో దూసుకెళతామని భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించిన భారత జట్టు ఆతర్వాత శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను కైవసం చేసుకుంది. తాజాగా ఆసియా కప్ టి-20 టోర్నీలోనూ విజయభేరి మోగించింది. ఈ వరుస విజయాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ధోనీ చెప్పాడు. ప్రస్తుతం జట్టుకు ఎవరూ మార్గదర్శకం చేయాల్సిన అవసరం లేదని, ఆటో పైలట్ మోడ్‌లో విమానం వెళ్లే తీరులోనే ముందుకు సాగుతున్నదని వ్యాఖ్యానించాడు. పొట్టి ఫార్మెట్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నామని, టి-20 వరల్డ్ కప్‌లో తమ స్థాయికి తగినట్టు రాణించేందుకు కృషి చేస్తామని అన్నాడు. ఈ టోర్నీలో చాలా బలమైన జట్లు బరిలోకి దిగుతున్నాయని అంటూ, ప్రతి మ్యాచ్‌నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామని చెప్పాడు.