క్రీడాభూమి

కివీస్‌కు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 17: టీమిండియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు ఆదిలోనే చుక్కెదురైంది. ముంబయిలోని బ్రాబోర్న్ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి సన్నాహక మ్యాచ్‌లో భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టు 30 పరుగుల తేడాతో విజయభేరి మోగించి కివీస్‌కు షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించగా, 47.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్ జట్టు కనీసం తన ఓవర్ల కోటాను పూర్తి చేయకుడానే ఓటమిపాలైంది. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ బౌలర్లలో షహబాజ్ నదీమ్, జయదేవ్ ఉనద్కత్ చెరో మూడు వికెట్లు కైవసం చేసుకుని కివీస్ పతనాన్ని శాసించారు.
అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చక్కగా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించి క్రీజ్‌లో పాతుకుపోయిన ఓపెనర్లు పృథ్వీ షా, లోకేష్ రాహుల్ చెరొక అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు 147 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. అనంతరం లోకేష్ రాహుల్ (75 బంతుల్లో 68 పరుగులు) ఇష్ సోధీ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు హెచ్‌ఎం.నికోల్స్‌కు క్యాచ్ ఇవ్వగా, కొద్దిసేపటికి పృథ్వీ షా (80 బంతుల్లో 66 పరుగులు) కూడా మిఛెల్ శాంట్నర్ బౌలింగ్‌లో నికోల్స్‌కే దొరికిపోయాడు. అయితే ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కూడా క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ మిగిలిన వారి నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (17), వికెట్‌కీపర్ రిషభ్ పంత్ (15), గుర్‌కీర్త్ సింగ్ (11) స్వల్ప స్కోర్లకే వెనుదిరగ్గా, నాయర్ (64 బంతుల్లో 78 పరుగులు) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మన్రోకి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆ తర్వాత శివమ్ చౌదరి (0), కర్ణ్ శర్మ (8), ధవళ్ కులకర్ణి (2) త్వరత్వరగా వెనుదిరగ్గా, మిలింద్ కుమార్ (10), జయదేవ్ ఉనద్కత్ (1) అజేయంగా నిలిచారు. దీంతో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 5 వికెట్లు కైవసం చేసుకోగా, మిఛెల్ శాంట్నర్ 2 వికెట్లు, టిమ్ సౌథీ, ఇష్ సోధీ ఒక్కో వికెట్ అందుకున్నారు.
అనంతరం 296 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టును బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ బౌలర్లు గడగడలాడించారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (22), కొలిన్ మన్రో (26) స్వల్ప స్కోర్లకే వెనుదిరగ్గా, ఆ తర్వాత కెప్టెన్ కాన్ విలియమ్‌సన్ (47), రాస్ టేలర్ (34), టామ్ లాథమ్ (59), మిఛెల్ శాంట్నర్ (26) మాత్రమే కొంతసేపు పోరాడారు. అయితే వీరి నిష్క్రమణ తర్వాత కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ (33), గ్లెన్ ఫిలిప్స్ (10-నాటౌట్) మినహా మిగిలిన వారంతా పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో 47.4 ఓవర్లలో 265 పరుగులకే ఆలౌటైన న్యూజిలాండ్ జట్టు 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, షహబాజ్ నదీమ్ చెరో రెండు వికెట్లు కైవసం చేసుకోగా, ధవళ్ కులకర్ణి, గుర్‌కీర్త్ సింగ్, ఆవేశ్ ఖాన్, కర్ణ్ శర్మ ఒక్కో వికెట్ అందుకున్నారు.

చిత్రం..64 బంతుల్లో 78 పరుగులు సాధించిన టాప్ స్కోరర్ కరుణ్ నాయర్