క్రీడాభూమి

సిరీస్‌పై బిసిసిఐ ఎటూ తేల్చడం లేదు: పిసిబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 18: ద్వైపాక్షిక సిరీస్‌లపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎటూ తేల్చకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అసంతృప్తి వ్యక్తం చేసింది. 2019 నుంచి 2023 మధ్య కాలానికిగాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఇటీవల ఆమోదించిన ఫ్యూచర్స్ అండ్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టిపి)పై బిసిసిఐ స్పందించకపోవడం దురదృష్టకరమని పిసిబి చైర్మన్ నజాం సేథీ వ్యాఖ్యానించాడు. బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో అతను మాట్లాడుతూ 2014లో కుదిరిన ఒప్పందం ప్రకారమే మ్యాచ్‌ల సంఖ్య ఉండాలని ఐసిసిని డిమాండ్ చేస్తున్నామని చెప్పాడు. అప్పట్లో ఒప్పందం ప్రకారం భారత జట్టు పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడాల్సిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. రొటేషన్ విధానాన్ని అనుసరించి ఈసారి పాక్‌లో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా రావాల్సి ఉందన్నాడు. ఇలావుంటే, లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌లో భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని ప్రపంచ దేశాలన్నీ అనుమానాలు వ్యక్తం చేయడం భారత్‌కు కలిసొచ్చింది. నిజానికి అంతకు ముందే పాక్‌తో భారత్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను రద్దు చేసుకుంది. ప్రపంచ దేశాలేవీ పాక్‌కు రావడానికి సిద్ధంగా లేకపోవడంతో, పిసిబి హోం సిరీస్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆడిస్తున్నది. ఈ అంశాలను గుర్తుచేస్తూ, పాకిస్తాన్‌కు రాకపోయినా, సిరీస్‌లను యుఎఇలోనే భారత్ ఆడాలని సేథీ చెప్పాడు. యుఎఇలో ఆడేందుకు మిగతా దేశాలకు లేని అభ్యంతరం భారత్‌కు ఎందుకని ప్రశ్నించాడు. ఐసిసి తాజాగా ఎఫ్‌టిపిని ప్రకటించినప్పుడు బిసిసిఐ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అన్నాడు. అయితే, దాని ప్రకారమే సిరీస్‌లు ఆడే విషయాన్ని ధ్రువీకరించలేదని వాపోయాడు. భారత్ వైఖరి ఏమిటో తెలియక, అర్థంగాక అయోమయ పరిస్థితి నెలకొందని తెలిపాడు. 2019 నుంచి నాలుగేళ్ల కాలానికి రూపొందించిన ఎఫ్‌టిపిని బిసిసిఐ పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదన్నాడు. ఐసిసి రూపొందించే ఎఫ్‌టిపికి కూడా ప్రభుత్వాల ఆమోద ముద్ర ఉండాలనే నిబంధనలను చేర్చాలని బిసిసిఐ పట్టుబడుతుండవచ్చని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడనందుకు 70 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలన్న ఐసిసి కమిటీకి చేసిన ఫిర్యాదుకూ, రాబోయే ఎఫ్‌టిపికీ సంబంధం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశాడు. 2014 నుంచి 2016 వరకు అమల్లో ఉండేలా కుదిరిన ఒప్పందం ప్రకారం ఆడాల్సిన సిరీస్‌లను భారత్ ఆడలేదని, అందుకే నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నామని సేథీ చెప్పాడు. ఐసిసి తాజాగా నిర్ధారించిన షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మొత్తం 19 మ్యాచ్‌లు జరగాలని అన్నాడు. కొత్త షెడ్యూల్‌ను ఇప్పటికే డిమాండ్ చేస్తున్న నష్టపరిహారంతో ముడిపెట్టడానికి వీల్లేదన్నాడు.