క్రీడాభూమి

మళ్లీ పాక్‌తోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 20: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్ మరోసారి సిద్ధమైంది. ఇక్కడ జరుగుతున్న ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ గ్రూప్ దశలో పాక్‌ను ఓడించిన భారత్ శనివారం జరిగే సూపర్ 4 తుది మ్యాచ్‌లో మరోసారి అదే జట్టును ఢీ కొంటున్నది. టైటిల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన భారత్ ఒక్క మ్యాచ్‌ని కూడా కోల్పోకుండా ముందంజ వేస్తున్నది. అదే ఒరవడిని కొనసాగించి, పాకిస్తాన్‌ను మళ్లీ చిత్తుచేయాలని మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ పట్టుదలతో ఉంది. ఈ టోర్నీలో దక్షిణ కొరియాతో మ్యాచ్‌ని 1-1గా డ్రా చేసుకోవడం మినహా, అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయభేరి మోగించిన భారత్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తున్నది. రొలాంట్ ఆల్ట్‌మన్స్ నుంచి చీఫ్ కోచ్‌గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న రొరెడ్ మరినే నేతృత్వంలో మన్‌ప్రీత్ బృందం అన్ని విధాలా పోరాటానికి సిద్ధమైంది. మిగతా జట్ల కంటే మెరుగైన గోల్ రేట్‌ను సాధించిన భారత జట్టు శనివారం నాటి మ్యాచ్‌ని డ్రా చేసుకున్నా ఆదివారం జరిగే తుది పోరుకు అర్హత సంపాదిస్తుంది. అయితే, డ్రాతో సంతృప్తి చెందకుండా, ఫైనల్‌కు అవసరమైన ప్రాక్టీస్‌ను సంపాదించేందుకు ఆ మ్యాచ్‌ని ఉపయోగించుకోనుంది. ఆకాశ్‌దీప్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, ఎస్వీ సునిల్, లలిత్ ఉపాధ్యాయ, గుజ్రాంత్ సింగ్ తదితరులు అద్భుతమైన ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొస్తున్న అంశం. కాగితంపై చూస్తే అన్ని విభాగాల్లోనూ బలహీనంగా కనిపిస్తున్న పాకిస్తాన్ ఏ విధంగా పోరాటాన్ని కొనసాగిస్తుందో, ఎంత వరకూ భారత్‌ను నిలువరిస్తుందో చూడాలి. విశే్లషకులు మాత్రం భారత్ మరోసారి పాక్‌ను చిత్తు చేసి, టైటిల్‌ను అందుకునే అవకాశాలను మరింత మెరుగు పరచుకుంటుందని జోస్యం చెప్తున్నారు.