క్రీడాభూమి

కిడాంబి శ్రీకాంత్‌కు డెన్మార్క్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడెన్స్, అక్టోబర్ 22: భారత స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరిగిన డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో అతను 2-15, 21-5 తేడాతో లీ హ్యున్ లీని చిత్తుచేశాడు. బలమైన స్మాష్‌లు, అద్భుతమైన ప్లేసింగ్స్‌తో అద్వితీయ ప్రతిభ కనబరచిన శ్రీకాంత్ ముందు లీ హ్యున్ నిలవలేకపోయాడు.
పురుషుల డబుల్స్ విభాగంలో లీ చెంగ్, జాంగ్ నాన్ జోడీ 21-16, 22-24, 21-19 ఆధిక్యంతో మార్కస్ ఫెర్నాల్డీ గిడియన్, కెవిన్ సంజయ సుకముటో జోడీపై విజయం సాధించి, టైటిల్ అందుకుంది.
మహిళల సింగిల్స్‌లో అతానే యమాగుచీని ఓడించిన రచానొక్ ఇంతనాన్ టైటిల్ గెల్చుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఇంతనాన్ 14-21, 21-15, 21-19 ఆధిక్యంతో గెలిచింది.
మహిళల డబుల్స్ ఫైనల్‌లో షిహో తనాకా, కొహారు యోనెమోటో జోడీని 21-13, 21-16 స్కోరుతో ఓడించిన లీ సొ హీ, షిన్ సియాంగ్ చాన్ జోడీ టైటిల్ సాధించింది.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తాంగ్ చున్ మాన్, సే ఇంగ్ సయెట్ జోడీ టైటిల్ అందుకుంది. వీరు ఫైనల్‌లో జెంగ్ సివెయ్, చెన్ క్వింగ్‌చెన్ జోడీపై 14-212, 21-15, 21-19 తేడాతో విజయం సాధించారు.

చిత్రం..డెన్మార్క్ ఓపెన్ బాడ్మింటన్ విజేత కిడాంబి శ్రీకాంత్