క్రీడాభూమి

కోహ్లీ ప్రతిభావంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు కెప్టెన్, యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై ‘ఆజ్ తక్ సలాం క్రికెట్’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఒకరు అతనిని జావేద్ మియందాద్, టెన్నిస్ మాజీ సూపర్ స్టార్ జాన్ మెకెన్రోతో పోలిస్తే మరొకరు టీమిండియాలో మిగతా ఆటగాళ్లు ఎవరికీ లేని ప్రత్యేక, గౌరవం, ప్రధాన్యం కోహ్లీకి మాత్రమే ఉన్నాయని అన్నాడు. కోహ్లీ ప్రత్యేక ఆటగాడని, జట్టు మొత్తాన్ని ఒకేతాటిపైకి తీసుకురాగల సమర్థుడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. జట్టులో రోహిత్ శర్మ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారని, అయితే, సుమారు ఆరేళ్ల కాలంలో కోహ్లీ భారత బ్యాటింగ్‌ను కొత్త పుంతలు తొక్కించాడని ప్రశంసించాడు. దేశవిదేశాల్లో కోహ్లీ పరుగుల వరద పారించాడని, మ్యాచ్‌లను గెలిపించే సత్తా అతనికి ఉందని గంగూలీ అన్నాడు. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియాపై అతను చేసిన వరుస శతకాలను ఎవరూ మరచిలేరని చెప్పాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్ హక్, అమీర్ సొహైల్ కూడా కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తారు. పిచ్ తీరు ఎలావున్నా పరుగుల వరద సృష్టించే సామర్థ్యం కోహ్లీలో ఉందని ఇంజమామ్ అన్నాడు. జట్టులో అలాంటి ఆటగాడు ఉంటే, మిగతా వారి ఆత్మస్థైర్యం ఎంతగానో పెరుగుతుందని సొహైల్ అన్నాడు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో వసీం అక్రం మైదానంలో ఉంటే తామంతా రెట్టించిన ఉత్సాహంతో ఆడేవాళ్లమని గుర్తుచేసుకున్నాడు. కోహ్లీని టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ పొగడ్తలతో ముంచెత్తుతూ అర్ధరాత్రి లైట్లు అన్నీ ఆర్పేసినప్పుడు కూడా కోహ్లీ పరుగుల వరద కురిపించగలడంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. అతను భారత క్రికెట్‌ను కొత్తపుంతలు తొక్కిస్తున్నాడని కొనియాడాడు.
సవాళ్లు విసరడం, సవాళ్లను స్వీకరించడం కోహ్లీకి చాలా ఇష్టమని పాకిస్తాన్ మరో మాజీ కెప్టెన్ వసీం అక్రం అన్నాడు. అతని వ్యూహరచన అద్భుతమని పేర్కొన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కోహ్లీకి బంతులు వేయాల్సివస్తే తాను ముందుగా ఇన్‌స్వింగర్‌ను ప్రయోగిస్తానని అక్రం చెప్పాడు. అతను ఏమాత్రం తడబడినా, ఇన్‌కమింగ్ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తానని అన్నాడు.

‘ఆజ్ తక్ సలాం క్రికెట్’ కార్యక్రమంలో పాల్గొన్న భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, మహమ్మద్ అజరుద్దీన్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అమీర్ సొహైల్, భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా