క్రీడాభూమి

సెంచరీ హీరోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వనే్డ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఎక్కువ శతకాలు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రికీ పాంటింగ్‌ను మూడో స్థానానికినెట్టిన విరాట్ కోహ్లీ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ మాత్రమే ఎక్కువ వనే్డ శతకాల్లో కోహ్లీ కంటే ముందున్నాడు.
వనే్డల్లో అత్యధిక శతకాలు ‘టాప్-10’
1. సచిన్ తెండూల్కర్ (్భరత్/ 463 మ్యాచ్‌ల్లో 49 శతకాలు), 2. విరాట్ కోహ్లీ (్భరత్/ 200 మ్యాచ్‌ల్లో 31 శతకాలు), 3. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా/ 375 మ్యాచ్‌ల్లో 30 సెంచరీలు), 4. సనత్ జయసూర్య (శ్రీలంక/ 445 మ్యాచ్‌ల్లో 28 సెంచరీలు), 5. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా/ 158 మ్యాచ్‌ల్లో 26 శతకాలు), 6. ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 225 మ్యాచ్‌ల్లో 25 సెంచరీలు), కుమార సంగక్కర (శ్రీలంక/ 404 మ్యాచ్‌ల్లో 25 సెంచరీలు), 7. క్రిస్ గేల్ (వెస్టిండీస్/ 273 మ్యాచ్‌ల్లో 22 శతకాలు), సౌరవ్ గంగూలీ (్భరత్/ 311 మ్యాచ్‌ల్లో 22 శతకాలు), తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక/ 330 మ్యాచ్‌ల్లో 22 శతకాలు), 8. హెర్చలె గిబ్స్ (దక్షిణాఫ్రికా/ 248 మ్యాచ్‌ల్లో 21 సెంచరీలు), 9. సరుూద్ అన్వర్ (పాకిస్తాన్/ 247 మ్యాచ్‌ల్లో 20 సెంచరీలు), 10. బ్రియాన్ లారా (వెస్టిండీస్/ 299 మ్యాచ్‌ల్లో 19 శతకాలు), మహేల జయవర్ధనే (శ్రీలంక/ 448 మ్యాచ్‌ల్లో 19 శతకాలు).
‘డబుల్ సెంచరీ’!
ముంబయి: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో 200 వనే్డ మ్యాచ్‌ల మైలురాయిని పూర్తి చేశాడు. భారత్ తరఫున 200 లేదా అంతకంటే ఎక్కువ వనే్డలు ఆడిన 14వ క్రికెటర్‌గా అవతరించాడు. ఎక్కువ వనే్డలు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ తెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను మొత్తం 463 మ్యాచ్‌లు ఆడాడు. ఇది ప్రపంచ రికార్డు కూడా కావడం విశేషం. భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ (344 మ్యాచ్‌లు), మహమ్మద్ అజరుద్దీన్ (334 మ్యాచ్‌లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.
200 లేదా అంతకంటే ఎక్కువ వనే్డ మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్లు
1. సచిన్ తెండూల్కర్ (463 మ్యాచ్‌లు/ ప్రపంచ రికార్డు), 2. రాహుల్ ద్రవిడ్ (344 మ్యాచ్‌లు), 3. మహమ్మద్ అజరుద్దీన్ (334 మ్యాచ్‌లు), 4. సౌరవ్ గంగూలీ (311 మ్యాచ్‌లు), 5. మహేంద్ర సింగ్ ధోనీ (306 మ్యాచ్‌లు), 6. యువరాజ్ సింగ్ (304 మ్యాచ్‌లు), 7. అనిల్ కుంబ్లే (271 మ్యాచ్‌లు), 8. వీరేందర్ సెవాగ్ (251 మ్యాచ్‌లు), 9. హర్భజన్ సింగ్ (236 మ్యాచ్‌లు), 10. జవగళ్ శ్రీనాథ్ (229 మ్యాచ్‌లు), 11. కపిల్ దేవ్ (225 మ్యాచ్‌లు), 12. సురేష్ రైనా (223 మ్యాచ్‌లు), 13. జహీర్ ఖాన్ (200 మ్యాచ్‌లు), 14. విరాట్ కోహ్లీ (200 మ్యాచ్‌లు).
*
కోహ్లీ 2016 ప్రారంభం నుంచి మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అన్ని ఫార్మాట్స్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. వనే్డల్లో గత ఏడాది మూడు శతకాలు సాధిస్తే, ఈ ఏడాది ఇప్పటికే నాలుగో సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై తిరుగులేని ఫామ్‌ను కనబరచిన కోహ్లీ న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన వనే్డలోనూ సత్తా చాటాడు. 2008 ఆగస్టులో శ్రీలంకపై తొలి వనే్డతో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన కోహ్లీ కీలక ఆటగాడిగా ఎదిగాడు. అందుకే, అన్ని ఫార్మాట్స్‌లోనూ టీమిండియా పగ్గాలు అతని చేతికి దక్కాయి.