క్రీడాభూమి

సర్కారు క్లియరెన్స్ కోసం పిసిబి ఎదురుచూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ కోల్‌కతాకు మారడాన్ని పిసిబి స్వాగతించింది. ఈ మార్పుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అయతే, జట్టును భారత్‌కు పంపేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు బుధవారానికే ఇక్కడికి చేరుకోవాలి. 17న ధర్మశాలకు బయలుదేరాలి. అయితే, జట్టును భారత్‌కు పంపే విషయంలో పిసిబి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ పాక్ సర్కారు చివరి క్షణాల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అర్ధ రాత్రి దాటిన తర్వాత జట్టును పంపే అవకాశాలు లేకపోలేదు. ధర్మశాల మ్యాచ్ కోల్‌కతాకు మారడంతో, ఆ జట్టు మ్యాచ్ పూర్తయిన తర్వాత, ఇక్కడి నుంచే 22న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ కోసం మొహాలీకి బయలుదేరుతుంది.