క్రీడాభూమి

ఈడెన్‌లో భారత్, పాక్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఉత్కంఠ రేపుతున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన టి-20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్ కోల్‌కతాలోనీ ఈడెన్ గార్డెన్స్‌కు మారింది. ధర్మశాలలో మ్యాచ్ జరిగే భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ చేతులెత్తేయగా, అవసరమైతే పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక అవగాహన కుదరక ముందే, ధర్మశాలలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన ఒక బృందాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) భారత్‌కు పంపిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ లాహోర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పిసిబి భద్రతా విభాగం చీఫ్ కల్నల్ (రిటైర్డ్) ఆజం ఖాన్ ధర్మశాలకు వచ్చి అక్కడి ఏర్పాట్లను చూసిన తర్వాత పిసిబికి నివేదికను సమర్పించారు. భద్రతపై భారత ప్రభుత్వం నుంచి తాము లిఖితపూర్వక హామీని కోరినట్టు పిసిబి చైర్మన్ హషర్యార్ ఖాన్ లాహోర్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే, తమ బృందానికి భారత్ నుంచి ఎలాంటి హామీ లభించలేదని చెప్పాడు. కాగా, మొహాలీ లేదా కోల్‌కతాలో మ్యాచ్ జరిగితే భద్రతపై తమకు ఎలాంటి అనుమానాలు ఉండవని పిసిబి స్పష్టం చేసుంది. దీనితో కోల్‌కతాను ఖరారు చేస్తూ, ఈ మార్పును గుర్తించాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కోరింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మ్యాచ్ అధికారికంగా కోల్‌కతాకు మారింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ స్వయంగా భద్రతా ఏర్పాట్లపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్‌ని జరగనివ్వమని కొన్ని సంస్థలు, కొంత మంది వ్యక్తులు బహిరంగ ప్రకటనలు ఇవ్వడం పట్ల పిసిబి ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే, భారత్, పాక్ మ్యాచ్‌ని మరో కేంద్రానికి తరలించాలని కోరింది. మొహాలీ పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ, చివరికి కోల్‌కతాలోనే మ్యాచ్‌ని నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.