క్రీడాభూమి

ప్రతీకారానికి పాక్ తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఇటీవల ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి తహతహలాడుతున్నది. టి-20 వరల్డ్ కప్‌లో బుధవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి, టోర్నీలో శుభారంభం చేయాలన్న పట్టుదలతో ఉంది. భారత్‌ను పొగిడినందుకు స్వదేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ షహీద్ అఫ్రిదీకి ఈ మ్యాచ్ కీలకం కానుంది. జట్టును విజయపథంలో నడిపిస్తేనే అతనిపై ఉభ్న వ్యతిరేకత కొంతవరకైనా తగ్గుతుంది. లేకపోతే, మరిన్ని విమర్శలకు గురికావాల్సి వస్తుంది. మష్రాఫ్ మొర్తాజా నాయకత్వంలోని బంగ్లాదేశ్‌ను అసాధారణ జట్టుగా అభివర్ణించలేకపోయినా, సంచలన విజయాలను నమోదు చేసే సత్తా ఉన్న జట్టుగా పేరు సంపాదించింది. ఏ క్షణంలోనైనా దాడికి ఉపక్రమించడం, ఎంత పెద్ద జట్టునైనా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం బంగ్లాదేశ్ నైజం. ఈ లక్షణాలు మొర్తాజా బృందాన్ని విలక్షణ జట్టుగా తీర్చిదిద్దాయి. కాగితంపై చూస్తే అన్ని విభాగాల్లోనూ పాకిస్తాన్‌దే పైచేయిగా కనిపిస్తున్నది. కానీ, బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితి.
మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది.

అఫ్రిదీ తప్పేమీ లేదు
పాక్ కోచ్ వకార్ యూనిస్
కోల్‌కతా, మార్చి 15: భారత్ అభిమానుల నుంచి తమకు గొప్ప ఆదరాభిమానాలు లభిస్తున్నాయని షహీద్ అఫ్రిదీ పేర్కోవడంలో తప్పేమీ లేదని పాకిస్తాన్ కోచ్, మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ స్పష్టం చేశాడు. అతను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాడని, అందులో విమర్శించాల్సిన అంశాలు ఏవీ లేవని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వకార్ అన్నాడు. పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్‌లోని అభిమానులే తమకు ఎక్కువ ప్రేమాభిమానాలను పంచుతున్నారని అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తడం సిగ్గుచేటని పాక్ లెజెండరీ బ్యాట్స్‌మన్ జావేద్ మియందాద్ ధ్వజమెత్తాడు. పాక్ మీడియాతోపాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా అఫ్రిదీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించడంతో వకార్ వివరణ ఇచ్చాడు. క్రికెట్‌కు ఎల్లలు లేవని, అభిమానులు ఎక్కడైనా ఉంటారని చెప్పడానికే అఫ్రిదీ ప్రయత్నించాడని అన్నాడు.
నాది సానుకూల స్పందన: అఫ్రిదీ
భారత్‌లో మ్యాచ్‌లు ఆడడంపై తాను సానుకూలంగా స్పందించానని, ఒక గొప్ప సందేశం ఇచ్చానని అఫ్రిదీ అన్నాడు. తన మాటలను వక్రీకరించాల్సిన అవసరం లేదన్నాడు. తాను చేసిన వ్యాఖ్యలకు విపరీతార్థాలు తీయవద్దని కోరాడు. తాను పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మాత్రమే కెప్టెన్‌ను కానని, లక్షలాది మంది పాక్ అభిమానులకు కూడా ప్రాతనిథ్యం వహిస్తున్నానని అన్నాడు. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సానుకూల ధోరణిలో సమాధానం చెప్పానే తప్ప ఎవరినీ తక్కువ చేయడం తన ఉద్దేశం కాదన్నాడు. భారత్‌లోని క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ ఆటగాళ్లను కూడా ఆదరిస్తారన్న విషయం చాలా మందికి తెలుసునని అఫ్రిదీ అన్నాడు. వకార్ యూనిస్, వసీం అక్రం, ఇంజమాముల్ హక్ వంటి మాజీ కెప్టెన్లకు భారత్‌లో ఎంతో ఆదరణ ఉందని తెలిపాడు. క్రికెట్‌కు ఎల్లలు ఉండబోవని, రాజకీయాలతో సంబంధం లేదని అఫ్రిదీ స్పష్టం చేశాడు.
ప్రాక్టీస్‌కు డుమ్మా
తన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అఫ్రిదీ మంగళవారం నెట్ ప్రాక్టీస్‌కు గైర్హాజరయ్యాడు. అతను నెట్స్‌కు రాకపోవడంపై పాక్ జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

విండీస్‌లో కొత్త ఉత్సాహం!

ముంబయి, మార్చి 16: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో వెస్టిండీస్ జట్టు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ కోసం విండీస్ ఆటగాళ్లు ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేశారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)తో చాలాకాలం కొనసాగిన కాంట్రాక్టు వివాదానికి తెరపడడంతో పలువురు సీనియర్ ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి వచ్చారు. దీనితో ఇన్నాళ్లూ ద్వితీయ శ్రేణి జట్టుగా ముద్రపడిన విండీస్ ఇప్పుడు పూర్తి స్థాయి జట్టుగా టి-20 వరల్డ్ కప్ పోరును ఆరంభించనుంది. కాంట్రాక్టులోని అంశాలపై ఆటగాళ్లు, డబ్ల్యుఐసిబి మధ్య ఏకాభిప్రాయం కుదరక సుమారు రెండేళ్లు విండీస్ జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టి-20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందే ఇరు వర్గాలు రాజీకి రావడం శుభపరిణామం. క్రిస్ గేల్, కెప్టెన్ డారెన్ సమీ, సులేమాన్ బెన్, జాసన్ హోల్డర్, ఆండ్రె ఫ్లెచర్, డ్వెయిన్ బ్రేవో, సామ్యూల్ బద్రీ, లెండల్ సిమన్స్, జెరోమ్ టేలర్, ఆండ్రె రసెల్, మార్లొన్ సామ్యూల్స్, దనెష్ రాందీన్ వంటి సీనియర్లు ఒప్పందంపై సంతకాలు చేసి, తిరిగి జట్టులోకి అడుగుపెట్టారు. డారెన్ బ్రేవో, కీరన్ పోలార్డ్, ‘స్పిన్ మాంత్రికుడు’ సునీల్ నారైన్ వేర్వేరు కారణాలతో ఈ టోర్నీకి హాజరుకాలేదు. అయితే, ఈ ముగ్గురు లేకపోయినా, జట్టు సమతూకంగా ఉందని, ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని విండీస్ కెప్టెన్ డారెన్ సమీ ధీమా వ్యక్తం చేశాడు. ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉండడం జట్టుకు అదనపు బలం. కాగితంపై చూస్తే ఇంగ్లాండ్ పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, విండీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
గేల్‌పైనే భారం!
సీనియర్ ఆటగాడు క్రిస్ గేల్‌పైనే విండీస్ ఎక్కువగా భారం వేస్తున్నదనడంలో ఏమాత్రం సందేహంలేదు. అతను ఏ విధంగా రాణిస్తాడనే అంశంపైనే విండీస్ జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. మిగతా ఆటగాళ్ల విషయం ఎలావున్నా, మ్యాచ్‌ని ఒంటి చేత్తో గెలిపించే సత్తా గేల్‌కు ఉంది. ఎన్నో సందర్భాల్లో ఈ విషయం రుజువైంది. మరోసారి అతని విజృంభణను తిలకించాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంగ్లాండ్ ప్రాక్టీస్
పాకిస్తాన్‌తో బుధవారం జరిగే మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌లో చాలామంది యువ ఆటగాళ్లు ఉన్నారు. విండీస్ మాదిరిగానే ఇంగ్లాండ్ కూడా పునర్మిర్మాణ దశలో ఉంది. అయితే, అలెక్స్ హాలె, జో రూట్, జొస్ బట్లర్ వంటి సీనియర్ ఆటగాళ్ల అండ ఇంగ్లాండ్‌ను ఆదుకుంటున్నది. ఈ మ్యాచ్‌ని గెల్చుకొని శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉండడంతో, పోరు ఉత్కంఠను రేపనుంది.
మ్యాచ్ బుధవారం రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది.