క్రీడాభూమి

గేల్ విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: తనదైన రోజున ఎంతటి విధ్వంసాన్ని సృష్టింగలనన్న విషయాన్ని వెస్టిండీస్ సూపర్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి రుజువు చేశాడు. టి-20 వరల్డ్ కప్‌లో బుధవారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విండీ స్‌కు మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు చేజార్చుకొని 182 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరును సాధించింది. జో రూట్ 48, జొస్ బట్లర్ 30, అలెక్స్ హాలెస్ 28 పరుగులతో రాణించారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అజేయంగా 27 పరుగులు చేశాడు. వీరి కృషి ఫలితంగా ఇంగ్లాండ్ మెరుగైన స్కోరును చేయగలిగింది. కానీ, విండీస్ హీరో గేల్ ముందు ఇది చాలా చిన్న లక్ష్యంగా మారిపోయంది. విశ్వరూపాన్ని ప్రదర్శించిన అతను 48 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 11 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు చేశాడు. వంద పరుగుల్లో 86 పరుగులు ఫో ర్లు, సిక్సర్ల రూపంలో వచ్చినవే కావడం విశేషం. మార్లొన్ సామ్యూల్స్ 37 పరుగులు చే స్తే, ఆండ్రె రసెల్ అజేయంగా 16 పరుగులు చేశాడు. సిక్సర్లతో హోరెత్తించిన గేల్ ఒక్కడే మ్యాచ్‌లో స్టార్ అట్రాక్షన్ అయ్యాడు. బంతిని బలంగా బౌండరీకి తరలిస్తూ అతను ప్రేక్ష కులను మైమరపించాడు. గేల్‌కు ఏ విధంగా బంతులు వేయాలో అర్థంగాక ఇంగ్లాండ్ బౌలర్లు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఆరు వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గేల్ ఫామ్‌లోకి రావడం విండీస్‌కు శుభసూచకం.

లంకకు అఫ్గాన్ సవాల్!

కోల్‌కతా, మార్చి 16: నిలకడలేని ఆటతో అల్లాడుతున్న డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకకు చిన్నచిన్న జట్లు కూడా సవాళ్లు విసురుతున్నాయి. టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ నుంచి లంకకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009, 2012 సంవత్సరాల్లో రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్న లంక 2014లో టైటిల్ సాధించింది. అయితే, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే వంటి మేటి క్రికెటర్ల రిటైర్మెంట్ తర్వాత బలహీన పడిన లంక, 2014 నుంచి ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌లు ఆడింది. కానీ, కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేయగలిగింది. అసలే సమస్యలతో అల్లాడుతున్న లంకకు లసిత్ మలింగ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం మరో సమస్యను సృష్టించింది. టెస్టు, వనే్డ ఫార్మెట్స్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఏంజెలో మాథ్యూస్‌కే టి-20 ఫార్మెట్ పగ్గాలు కూడా దక్కాయి. సంక్లిష్టమైన పరిస్థితుల్లో అతను జట్టును ఏ విధంగా గట్టెక్కిస్తాడో చూడాలి. అస్గర్ సానిక్‌జయ్ నాయకత్వంలోని అఫ్గానిస్థాన్ జట్టు క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రతిభ కనబరచింది. ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడుతున్నది. శ్రీలంకను గెలిచే స్థాయి లేకపోయినా, గట్టిపోటీనిస్తుందనడంలో అనుమానం లేదు.

మ్యాచ్ గురువారం రాత్రి 7.30 గంటలకు
మొదలవుతుంది.

మలింగ డౌటే!
కోల్‌కతా: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగే టి-20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆడడం అనుమానంగానే ఉంది. మోకాలి నొప్పితో బాధపడుతున్న అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. అయితే లంక మేనేజ్‌మెంట్ ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. గురువారం మ్యాచ్ ఆరంభానికి ముందు వరకూ వేచిచూసి, తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఫిట్నెస్ సమస్యల కారణంగానే తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు మలింగ ప్రకటించిన విషయం తెలిసిందే.

పోరాడి నెగ్గిన జొకొవిచ్
ఇండియన్ వెల్స్: పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్ ప్రీ క్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో ఫిలిప్ కొల్చెర్బర్‌తో తలపడిన అతను 7-5, 7-5 తేడాతో అతి కష్టం మీద గెలిచాడు. కొల్చెర్బర్ ఈ స్థాయిలో పోటీనిస్తాడని ఎవరూ ఊహించలేదు. సర్వీసుల నుంచి డ్రాప్ షాట్స్ వరకూ అన్ని రకాలుగా కొల్చెర్బర్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకావడంతో జొకొవిచ్ విజయం కోసం పోరాడాల్సి వచ్చింది. క్వార్టర్స్‌లో స్థానం కోసం ఫెలిసియానో లొపెజ్‌ను జొకొవిచ్ నాలుగో రౌండ్‌లో ఎదుర్కొంటాడు. లొపెజ్ 7-6, 6-7, 6-4 ఆధిక్యంతో రాబర్టో బటిస్టా అగట్‌ను ఓడించాడు. మూడో రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో డొమిని థియెమ్ 7-5, 6-7, 6-1 తేడాతో జాక్ సాక్‌పై గెలిచాడు. జో విల్‌ఫ్రైడ్ సొంగా 6-3, 6-4 స్కోరుతో సామ్ క్వెర్రీని, అలెక్సాండర్ జెరెవ్ 6-2, 6-2 ఆధిక్యంతో గిలెస్ సిమోన్‌ను ఓడించారు. జాన్ ఇస్నర్ 6-4, 7-6 ఆధిక్యంతో ఆడ్రియన్ మనారినోపై గెలవగా, కెయ్ నిషికోరి 7-6, 7-6 తేడాతో స్టీవ్ జాన్సన్‌ను ఇంటిదారి పట్టించాడు. కాగా, చాలాకాలంగా గాయాల సమస్యలతో బాధపడుతూ పలు టోర్నీలకు దూరమైన రాఫెల్ నాదల్ కూడా నాలుగో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. అతను మూడో రౌండ్‌లో ఫెర్నాండో వెర్డాస్కోపై 6-0, 7-6 ఆధిక్యంతో విజయం సాధించాడు.