క్రీడాభూమి

స్విస్ ఓపెన్ బాడ్మింటన్ భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసెల్: స్విస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ లో ప్రపంచ మాజీ నంబర్ వన్ లీ చాంగ్ వెయ్‌ని ఓడించిన జెయంట్ కిల్లర్ సాయ ప్రణీత్‌తోపాటు అజయ్ జయరామ్, స మీర్ వర్మ కూడా మొదటి రౌండ్‌ను పూర్తి చేశారు. ప్రణీత్ 21- 14, 13-21, 21-6 తేడాతో మథియాస్ బోనీని ఓడించాడు. జి యాన్ షియాన్‌పై జయరామ్, కొజొనెన్‌పై ప్రయణ్ గెలిచారు.

మహిళల టి-20 వరల్డ్

బంగ్లాదేశ్‌తో పోరుకు ఇంగ్లాండ్ రెడీ
బెంగళూరు, మార్చి 16: మహిళల టి-20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందు వరుసగా మూడు వామప్ గేమ్స్‌ను గెల్చుకొని హ్యాట్రిక్‌ను నమోదు చేసిన ఇంగ్లాండ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మెయిన్‌డ్రాలో గురువారం బంగ్లాదేశ్‌ను ఢీకొనేందుకు సిద్ధమవుతున్నది. కాగా, ఆరంభ మ్యాచ్‌లోనే భారత్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసం దెబ్బతింది. అంతర్జాతీయ వేదికలపై అపారమైన అనుభవం ఉన్న చార్లొట్ ఎడ్వర్డ్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌ను జహనారా ఆలం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్ అడ్డుకోగలుగుతుందా అన్నది అనుమానంగానే ఉంది. బంగ్లాదేశ్‌పై అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ విజయం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ మ్యాచ్ గురువారం సాయంత్రం 3.30 గంటలకు మొదలవుతుంది.

ఇండియన్ వెల్స్ టెన్నిస్
క్వార్టర్స్‌కు హాలెప్

ఇండియన్ వెల్స్ (అమెరికా), మార్చి 16: ఇండియన్ వెల్స్ పిఎన్‌బి పరిబాస్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హాలెప్ టైటిల్ నిలబెట్టుకునే క్రమంలో మరో అడుగు ముందుకేసింది. నాలుగో రౌండ్‌లో బార్బరా స్ట్రికొవాను ఢీకొన్న ఆమె మొదటి సెట్‌ను 6-3 తేడాతో గెల్చుకుంది. రెండో సెట్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ దశలో గాయం కారణంగా స్ట్రికొవా మ్యాచ్ నుంచి వైదొలగ్గా, హాలెప్ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. సెమీ ఫైనల్‌లో స్థానం కోసం ఆమె ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను ఢీ కొంటుంది. మరో నాలుగో రౌండ్ మ్యాచ్‌లో సెరెనా 6-2, 6-2 ఆధిక్యంతో కాతెరీన బొండరెన్కోను సునాయాసంగా ఓడించింది. అగ్నీస్కా రద్వాన్‌స్కా 6-3, 6-3 స్కోరుతో జలెనా జన్కోవిచ్‌పై విజయం సాధించింది. ఆమె క్వార్టర్స్‌లో పెట్రా క్విటోవాతో తలపడుతుంది. క్విటోవా నాలుగో రౌండ్‌లో నికోల్ గిబ్స్‌పై 4-6, 6-3, 6-4 తేడాతో విజయభేరి మోగించింది. కాగా, దరియా కసట్కిన, కరోలినా ప్లిస్కోవా ఇప్పటికే క్వార్టర్స్ చేరారు. వీరిద్దరూ సెమీస్‌లో స్థానం కోసం పోరాడతారు.