క్రీడాభూమి

ఈడెన్ గార్డెన్‌లో నేడు భారత్-పాక్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 18: ఐసిసి వరల్డ్ కప్ టి-20 టోర్నమెంట్‌కు ముందు హాట్‌ఫేవరేట్‌గా నిలిచినప్పటికీ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఊహించని విధంగా ఓటమి పాలయిన టీమిండియాకు శనివారం ఇక్కడ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌ను ఢీకొనబోతోంది. సెమీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో దాయాది జట్టును ఎదుర్కొంటున్న భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో భారత్-పాక్‌ల మధ్య జరిగే అన్ని పోటీల్లాగానే ఈ మ్యాచ్ కూడా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. వాస్తవానికి ధర్మశాలలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను భద్రతా కారణాల రీత్యా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌కు మార్చారు.