క్రీడాభూమి

ఇంగ్లాండ్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు సత్తా చాటుకుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ హైస్కోరింగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించగా, అందుకు దీటుగా బదులిచ్చిన ఇంగ్లాండ్ జట్టు 19.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించి రికార్డు విజయంతో సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జో రూట్ (44 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లు సహా 83 పరుగులు) తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్లు హషీమ్ ఆమ్లా, క్వింటోన్ డీకాక్ చెరో అర్థ శతకంతో విజృంభించి 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం డీకాక్ (52) మొరుూన్ అలీ బౌలింగ్‌లో హాలెస్‌కు క్యాచ్ ఇవ్వగా, ఎబి.డివిలియర్స్ (16), కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (17)లతో కలసి మరో మరో 37 పరుగులు జోడించిన ఆమ్లా (58) మొరుూన్ అలీ బౌలింగ్‌లోనే లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించాడు. ఆ తర్వాత చివర్లో జెపి.డుమినీ (28 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లు సహా 54 పరుగులు), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పరుగులు) అజేయంగా నిలువడంతో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. ట్వంటీ-20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యుత్తమ స్కోరు.
అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్లు జాసన్ రాయ్ (16 బంతుల్లో 43 పరుగులు), అలెక్స్ హాలెస్ (7 బంతుల్లో 17), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ (9 బంతుల్లో 15) ధాటిగా ఆడి నిష్క్రమించగా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 15 బంతుల్లో 12 పరుగులు సాధించి వైదొలిగాడు. ఈ తరుణంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జో రూట్ సఫారీలకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా షాట్లతో రెచ్చిపోయి 29 బంతుల్లోనే అర్థ శతకాన్ని పూర్తిచేసుకున్న అతను వికెట్ కీపర్ జోస్ బట్లర్ (14 బంతుల్లో 21)తో కలసి 75 పరుగులు జోడించి 83 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ (3 బంతుల్లో 5), డేవిడ్ విల్లీ (0) త్వరత్వరగా నిష్క్రమించినప్పటికీ మొరుూన్ అలీ (10 బంతుల్లో 12), ఆదిల్ రషీద్ (0) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 19.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని సాధించింది. తద్వారా ట్వంటీ-20 క్రికెట్‌లో అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డులకు ఎక్కింది.

chitram
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జో రూట్
(44 బంతుల్లో 83 పరుగులు)