క్రీడాభూమి

ఏకైక టెస్టు డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 12: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ పోరు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ పర్యటనలో ఇంగ్లాండ్ ఆడిన ఏకైక టెస్టు డ్రాగా ముగియడంతో, యాషెస్ సిరీస్‌ను దక్కించుకునే అవకాశాలను ఆ జట్టు ఇంకా సజీవంగా నిలబెట్టుకుంది. ఈనెల 17, 19, 21 తేదీల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ మూడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. మొత్తం ఆరు పాయింట్లకుగాను, ఐదు పాయింట్లు సాధిస్తే ఇంగ్లాండ్‌కు యాషెస్ సిరీస్ దక్కుతుంది. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌ని గెల్చుకున్నా, యాషెస్ ట్రోఫీని నిలబెట్టుకుంటుంది. ఇలావుంటే, కీలకమైన ఏకైక టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 280 పరుగులకు ఆలౌటైంది. ఆతర్వాత ఆస్ట్రేలియా 9 వికెట్లకు 448 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఎలిస్ పెర్రీ (213) రికార్డు డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో ఆసీస్‌కు ఆ భారీ స్కోరు సాధ్యమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 168 పరుగులు వెనుకబడిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడింది. మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి రెండు వికెట్లకు 206 పరుగులు చేసింది. హీతర్ నైట్ 79 జార్జియా ఎల్విన్ 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ మహిళల తొలి ఇన్నింగ్స్: 116 ఓవర్లలో 280 ఆలౌట్ (టామీ బ్యూవౌంట్ 70, హీతర్ నైట్ 62, ఎలిస్ పెర్రీ 3/59).
ఆస్ట్రేలియా మహిళల తొలి ఇన్నింగ్స్: 166 ఓవర్లలో 9 వికెట్లకు 448 డిక్లేర్డ్ (ఎలిస్ పెర్రీ 213 నాటౌట్, సోపీ ఎక్సెల్‌స్టోన్ 3/107, లారా మార్ష్ 3/109), ఇంగ్లాండ్ మహిళల రెండో ఇన్నింగ్స్: 105 ఓవర్లలో 2 వికెట్లకు 206 (హీతర్ నైట్ 79 నాటౌట్, జార్జియా ఎల్విస్ 41 నాటౌట్, తహిలా మెక్‌గ్రాత్ 1/12).