క్రీడాభూమి

ఒక ఇన్నింగ్స్.. 14 మంది బౌలర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: భారత్ టూర్‌కు వచ్చిన 15 మంది ఆటగాళ్లలో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా మినహా మిగతా 14 మంది బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో డ్రాగా ముగిసిన టూర్ మ్యాచ్‌లో బౌలింగ్ వేశారు. లక్షన్ సండాకన్ అందరి కంటే ఎక్కువగా 12 ఓవర్లు బౌల్ చేశాడు. టూర్ మ్యాచ్‌ల్లో ఒక జట్టు తరఫున ఎంతమందైనా ఆడవచ్చు. అయితే, మైదనంలో ఉండే ఆటగాళ్ల సంఖ్య 11కు మించకూడదు. అదే విధంగా బ్యాటింగ్ కూడా పదకొండు మందికే (ఒకరు నాటౌట్‌గా నిలిస్తే పది మంది) పరిమితవుతుంది. సహజంగా కొంత సేపు బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మన్ మరొకరికి అవకాశం ఇచ్చేందుకు వీలుగా రిటైర్డ్ హర్ట్ మార్గంలో పెవిలియన్‌కు వెళతాడు. ఇది కేవలం ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో, శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ తాను స్వయంగా ఒక ఓవర్ వేయడంతోపాటు, మరో 13 మందికీ బౌల్ చేసే అవకాశం ఇచ్చాడు. వికెట్‌కీపర్ బౌలింగ్‌కు అనర్హుడు కాబట్టి డిక్‌విల్లాకు మినహాయింపు లభించింది. కొంత సేపు కీపింగ్ బాధ్యతలను మరొకరికి అప్పగిస్తే, అతను కూడా ఒకటిరెండు ఓవర్లు బౌల్ చేసేవాడేమో!